murder :ఇష్టం లేదని చెప్పినా వినకుండా.. చెల్లెలినే ఆ రొంపిలోకి దింపారు.. మాట వినలేదని చివరికి...?

murder :ఇష్టం లేదని చెప్పినా వినకుండా.. చెల్లెలినే ఆ రొంపిలోకి దింపారు..

Murder : తోడ బుట్టిన చెల్లెలు ( Sister ) అయినా.. ఆమెను తమతో పాటే వ్యభిచారంలోకి ( prostitution ) దింపారు. తనకు ఇష్టం లేదని చెప్పినా.. బెదిరించి కస్టమర్స్‌ వద్దకు పంపారు. అయితే తాను ఈ వృత్తి చేయను అంటూ భీష్మించుకు కూర్చున్న యువతిని చివరకు కుటుంబ సభ్యులే దారుణంగా హత్య ( murder ) చేసి పడేశారు.

  • Share this:
    వాళ్లు నలుగురు అక్కా చెల్లెళ్లు, ముగ్గురు పెళ్లిలు కూడా అయితే మరో మైనర్ చెల్లెలు ఉంది. కాగా తల్లిదండ్రులను కోల్పోవడంతో ఆమె అక్కలు అయిన రాఖీ దేవి, రూపాదేవీల వద్ద మైనర్ చెల్లెలు ఉంటుంది. అయితే తన అక్క రాఖీ ఝార్ఖండ్‌లో వ్యభిచారం నిర్వహిస్తోంది. తన భర్తతో పాటు మరో చెల్లెలు కూడా ఇందులో పాలుపంచుకుంటుంది. అయితే వారి కన్ను చెల్లెలు పై పడింది. తాము చేసేది చట్టవ్యతిరేకం అయినా ఆ రోంపిలోకి మిగతావారిని దింపేందుకు గ్యాంగ్ ఏర్పాటు చేశారు. వారితో పాటు చెల్లెలిని కూడా వ్యభిచార కూపంలోకి దింపాలని భావించారు. కాని ఈ వ్యభిచారంలోకి దిగడానికి బాలికకు ఇష్టం లేదు.

    అయినా.. బలవంతంగా రాఖీ తన చెల్లెలిని తన భర్తతో కలిసి వ్యభిచారంలోకి ( prostitution ) దింపింది. తనకు ఇష్టం లేకున్నా ఆమెను కస్టమర్స్ వద్దకు పంపేవారు. అయినా ఆ మైనర్ (minor girl ) బాలిక వ్యతిరేకించినా.. వారి మాటను నెగ్గించుకునే వారు. దీంతో చేసేది లేక మైనర్ బాలిక వ్యభిచార రోంపిలోకి దిగింది. తనకు వ్యభిచార వృత్తి ఇష్టం లేని బాలిక ఈ క్రమంలోనే అక్కడి నుండి బయటపడేందుకు తాను ఒకరిని ప్రేమిస్తున్నట్టు కుటుంబ సభ్యులకు తెలిపింది. అయితే వారు ఒప్పుకోలేదు. వ్యభిచార వృత్తిలోనే ఉండాలంటూ ఒత్తిడి తెచ్చారు.

    ఇది చదవండి : అమ్మాయి పెళ్లికి అంతా రెఢి అనుకున్నారు.. ఇంతలో ఆబ్బాయి వాట్సప్‌కి షాకింగ్ ఫోటో.. ఆ తర్వాత ఏం జరిగింది..?


    మరోవైపు ప్రేమికుడి మాయలో పడి ఎక్కడ దూరంగా వెళుతుందనని భావించిన అక్క రాఖీ తన భర్తతో పాటు మరికొంతమందితో కలిసి దారుణానికి ప్లాన్ (murder plan ) చేసింది. ఈ క్రమంలోనే ఆమెపై అత్యాచారం ( rape ) చేయించింది. ఇదే అదనుగా ప్రతాప్, నితేష్ ఇద్దరూ బాలికపై క‌న్నేసి రాఖీ సాయంతో ఆమెపై ప‌లుమార్లు లైంగిక దాడికి య‌త్నించారు.

    ఇది చదవండి : హిందూ అమ్మాయిని కన్న కూతురులా చూసుకుని పెళ్లి చేసిన ముస్లిం దంపతులు


    అనంతరం ఆమెను హత్య ( murder ) చేసి ఉరి వేశారు. అయితే ఇది జరుగుతున్నప్పుడు రాఖీతో పాటు ఇతరులు ఇంట్లో ఎవరు లేకుండా చూసుకున్నారు. హత్య సంఘటనను వారికి తెలపడంతో అందరు కలిసి ఓ ఆటోలో శవాన్ని వేసుకుని సోనార్ డ్యాంకు సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు.

    ఆనంతరం తమకు ఏమి తెలియనట్టు కనీసం పోలీసు కేసు కూడా నమోదు చేయకుండా వదిలేశారు. అయితే ఇటివల బాలిక శవం బయటపడడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీంతో అసలు నిజాలు బయటపడ్డాయి. సొంత అక్కే బాలిక మృతికి కారణమని పోలీసులు నిర్ధారించారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు.
    Published by:yveerash yveerash
    First published: