గుట్కా తినొద్దన్న తల్లిదండ్రులు... ఇంటి నుంచి పారిపోయిన కూతురు

ఆనాటి నుంచి ఎక్కడికి వెళ్లిందో ఎటు వెళ్లిందో చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి పారిపోయింది సగిరా. దీంతో కూతురి కోసం అక్కడ ఇక్కడ అన్ని చోట్ల వెతికిన తల్లిదండ్రులు.. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: July 17, 2019, 4:07 PM IST
గుట్కా తినొద్దన్న తల్లిదండ్రులు... ఇంటి నుంచి పారిపోయిన కూతురు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గుట్కా తింటున్న కూతుర్ని మందలించినందుకు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అహ్మదాబాద్ జిల్లాలోని అమ్రావతి ప్రాంతానికి చెందిన సగిరా అనే 15 ఏళ్ల బాలిక...తన తల్లిదండ్రులు, సోదరిలతో కలిసి నివసిస్తోంది. మార్చిలోనే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా రాసింది. అయితే సగిరాకు గుట్కా తీసుకునే అలవాటు ఉంది. ఒకరోజు ఇంట్లోనే సగీరా గుట్కా తింటుంటే చూసిన తల్లి షాక్ తింది. ఆ తర్వాత కూతుర్ని మందలించింది. ఈ విషయం కాస్త తండ్రికి కూడా చెప్పింది. ఇద్దరూ కలిసి కూతర్ని కూర్చొబెట్టి సముదాయించారు. గుట్కా ,పాన్ మసాలాలు వంటివి తినరాదని సర్దిచెప్పారు.

తల్లిదండ్రులు ఎంతగా చెప్పినా కూడా సగిరా ప్రవర్తనలో మార్పు రాలేదు. మరోసారి ఇంట్లోనే గుట్కా తినడం ప్రారంభించింది. దీంతో అదికాస్త ఈ సారి తండ్రి కంట పడింది. దీంతో కూతురు మరోసారి గుట్కా తినడం చూసిన ఆమె తండ్రి ఆగ్రహంతో ఊగిపోయాడు. కూతుర్ని పట్టుకొని రెండు పీకాడు. అంతే ఆరోజు అలా దెబ్బలు తిన్న కూతురు ఇక కనిపించలేదు. ఆనాటి నుంచి ఎక్కడికి వెళ్లిందో ఎటు వెళ్లిందో చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి పారిపోయింది సగిరా. దీంతో కూతురి కోసం అక్కడ ఇక్కడ అన్ని చోట్ల వెతికిన తల్లిదండ్రులు.. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సగిరా కోసం గాలిస్తున్నారు.
First published: July 17, 2019, 4:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading