పదే పదే అత్యాచారం.... చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చి బాలిక మృతి

ప్రతీకాత్మక చిత్రం

అదే గ్రామానికి చెందిన తమిళరసన్ అనే 27 ఏళ్ల యువకుడు బాలికనై కన్నేశాడు. ఆమెను మాయమాటలతో లొంగదీసుకున్నారు. బాలికపై పలుసార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు.

 • Share this:
  చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చి 17 ఏళ్ల బాలిక మృతిచెందిన విషాదకరమైన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఊతంకరై పుదూర్ భూగునై అనే గ్రామానికి చెందిన బాలిక తన తాత అవ్వ వద్ద ఉంటుంది. ప్రవైట్ కాలేజీలో చదువుతుంది. అయితే అదే గ్రామానికి చెందిన తమిళరసన్ అనే 27 ఏళ్ల యువకుడు బాలికనై కన్నేశాడు. ఆమెను మాయమాటలతో లొంగదీసుకున్నారు. బాలికపై పలుసార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈక్రమంలోనే బాధితురాలు గర్భం దాల్చింది. ఈ విషయం ఎవరికి తెలియకుండా కొంతకాలం దాచి పెట్టింది. అయితే ఆమె ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు. బాలిక గర్భంలో మృతిచెందిన శిశువు ఉందని వైద్యులు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు.

  దీంతో బాలికకు ఆపరేషన్ చేసి చనిపోయిన బిడ్డను బయటకు తీశారు. అయితే ఆ తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీంతో బాధితురాలిని చికిత్స నిమిత్తం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది. దీంతో ఆమె తల్లి పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు తమిళరసన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యువకుడిపై పోక్సో చట్ం కింద కేసు పెట్టారు.

  ఇవికూడా చదవండి:

  రేప్ చేయబోయి, గొంతు నులిమి... నాలుగేళ్ల బాలికపై టీనేజర్ దారుణం

  ఆసుపత్రిలో దారుణం... నిద్రపోతున్న మహిళా రోగులపై మేల్ నర్స్ లైంగిక దాడి...

   
  First published: