హోమ్ /వార్తలు /క్రైమ్ /

Karepalli : అయ్యో మనీషా.. ఎంతపని చేశావమ్మా.. మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడొద్దన్నందుకు..

Karepalli : అయ్యో మనీషా.. ఎంతపని చేశావమ్మా.. మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడొద్దన్నందుకు..

మృతురాలు మనీషా(పాత ఫొటో)

మృతురాలు మనీషా(పాత ఫొటో)

మొబైల్ ఫోన్లో ఆడుకోనివ్వడంలేదనో, ఫోన్ వాడొద్దని తల్లిదండ్రులు వార్నింగ్ ఇచ్చిన కారణంగానో ప్రాణాలు తీసుకుంటోన్న పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఖమ్మం జిల్లాలోనూ అలాంటి ఘటనే జరిగింది. సెల్ ఫోన్ వాడకం విషయంలో తల్లిదండ్రులు మందలించారని మనస్తాపం చెందిన స్కూల్ విద్యార్థిని మనీషా(15) విషంతాగి బలవన్మరణానికి పాల్పడింది. వివరాలివి..

ఇంకా చదవండి ...

మొబైల్ ఫోన్లను ఎక్కువ సమయంపాటు వాడటం అనర్థాలకు దారితీస్తుందని తెలిసినా, కరోనా విలయం కారణంగా మారిపోయిన విద్యా వ్యవస్థలో ఇప్పుడు పిల్లలు కూడా మొబైల్ ఫోన్లను వాడటం తప్పనిసరైంది. అయితే, క్లాసులు, చదువుకు సంబంధించిన వ్యవహారాలు కాకుండా ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న అవసరం లేని కంటెంట్ పిల్లల పాలిట శాపంగా, తల్లిదండ్రులకు సవాలుగా మారింది. మొబైల్ ఫోన్లో ఆడుకోనివ్వడంలేదనో, ఫోన్ వాడొద్దని తల్లిదండ్రులు వార్నింగ్ ఇచ్చిన కారణంగానో ప్రాణాలు తీసుకుంటోన్న పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఖమ్మం జిల్లాలోనూ అలాంటి ఘటనే జరిగింది. సెల్ ఫోన్ వాడకం విషయంలో తల్లిదండ్రులు మందలించారని మనస్తాపం చెందిన స్కూల్ విద్యార్థిని మనీషా(15) విషంతాగి బలవన్మరణానికి పాల్పడింది. వివరాలివి..

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరుపల్లి గ్రామానికి చెందిన బూడిగ నరేశ్, ఉమారాణి దంపతులకు మనీషా అనే కూతురుంది. కరోనా లాక్ డౌన్ లో ఆన్ లైన్ పాఠాలు విన్న ఆమె, ఇప్పుడు బడులు తెరిచిన తర్వాత కూడా ఫోన్ చూసే అలవాటును మానుకోలేదు. అవసరానికి మించి ఎక్కువ సమయం ఫోన్ వాడుతుండటం, తరచూ స్నేహితులకు ఫోన్లు చేస్తూ గంటలపాటు ముచ్చట్లు పెట్టడం లాంటివి చేస్తుండటంతో తల్లి ఉమాదేవి కూతురు మనీషాను హెచ్చరిస్తూ వస్తోంది. ఇటీవల కొంచెం గట్టిగా హెచ్చరించడంతో మనీషా మనస్తాపానికి గురైంది.

Hyderabad : శిల్పా చౌదరికి మళ్లీ షాక్ -ఆ పనికి భర్తను వాడుకోలేదా? -కోర్టు అనూహ్య తీర్పుమొబైల్ విషయంలో తల్లి తిట్టిందనే ఆక్రోషంలో మనీషా.. ఇంట్లో ఉన్న కలుపు మందు తాగేసింది. విషం తాగిన తర్వాత వాంతులు చేసుకుంటుండగా, ఏమైందని కుటుంబీకులు ఆరా తీయగా, పురుగుల మందు తాగినట్లు చెప్పింది. దీంతో మనీషను హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతుతూ పాప ప్రాణాలు కోల్పోయింది. తల్లి ఉమారాణి ఫిర్యాదు మేరకు కారేపల్లి ఏఎస్ఐ కృష్ణ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Harnaaz Sandhu : విశ్వసుందరి అందాలు చూస్తే వావ్ అనాల్సిందే -Miss Universe 2021 ఎలా అయిందంటే..


తెలిసీ తెలియని వయసు నుంచే పిల్లలకి స్మార్ట్ ఫోన్లు ఇవ్వడమంటే వారి చేతికి ఒక గ్రాము కొకైన్ ఇస్తున్నట్లేనని మానసిక శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వినియోగిస్తున్న చిన్నారుల్లో ఆలోచన శక్తి క్రమంగా క్షీణిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. కొంతమంది తల్లిదండ్రులు.. తమ పిల్లలు పనికి అడ్డుతగలకుండా, అల్లరి చేయకుండా ఒక చోట కూర్చోవాలనే ఉద్దేశంతో స్మార్ట్ ఫోన్లను వారి చేతికి ఇస్తున్నట్లు తెలిసింది. దీనివల్ల పిల్లలు ఆటలకు దూరమైన స్మార్ట్ ఫోన్లకు బానిసలవుతున్నారు. ఇది మానసిక సమస్యలనే కాకుండా శరీరక సమస్యలను కూడా ఏర్పరుస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

First published:

Tags: Khammam, Minor girl, Suicide

ఉత్తమ కథలు