విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. 17 ఏళ్ల బాలికను ఓ ఆటోడ్రైవర్ లైంగికంగా దాడి చేశాడు. ఆమె మీద అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఏకంగా తల్లిని చేశాడు. విజయనగరం జిల్లాలోని గజపతినగరంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో ఆ బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, పుట్టిన బిడ్డకు పాలివ్వడానికి ఆమె నిరాకరించింది. దీంతో పసిబిడ్డను పిల్లల వార్డుకు తరలించి, ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు. దీంతో ఆస్పత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ బాలికను ప్రశ్నించారు. అయితే, తనను గర్భవతిని చేసింది ఎవరో చెప్పేందుు ఆమె తొలుత అతడు ఎవరో చెప్పేందుకు నిరాకరించింది. అయితే, ఆ తర్వాత అసలు విషయం చెప్పింది. ఓ ఆటోడ్రైవర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్బవతిని చేశాడని, తాను కడుపుతో ఉన్నట్టు తెలియగానే పెళ్లిచేసుకోవడానికి మొహం చాటేశాడని తెలిపింది.
ఆ బాలిక తల్లిదండ్రులు కూలిపనిచేసుకుని జీవితం గడుపుతూ ఉంటారు. పనుల కోసం కొన్ని రోజుల పాటు ఇతర ప్రాంతాలకు కూడా వలస వెళ్తుంటారు. ఈ క్రమంలో బాలికను ఆటోడ్రైవర్ లొంగదీసుకున్నాడు. ఆమె కుటుంబసభ్యులు లేని సమయంలో అతడు పెళ్లి పేరు చెప్పి బాలికతో తన లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. బాలిక తల్లిదండ్రులు తిరిగివచ్చేసరికి కూతురు గర్భవతి అని తెలిసింది. అయితే, అప్పటికే చేయిదాటిపోయింది. తాజాగా బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గజపతినగరం ఆస్పత్రిలో బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. బాలిక చెప్పిన వివరాల ప్రకారం.. పోలీసులు నిందితుడైన ఆటోడ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.