హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: బాలికపై మనసుపడ్డ లేడీ టీచర్ భర్త.. తనతో శృంగారం చేయాలంటూ..

Shocking: బాలికపై మనసుపడ్డ లేడీ టీచర్ భర్త.. తనతో శృంగారం చేయాలంటూ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Odisha: బాలిక ట్యూషన్ కోసం లేడీ టీచర్ ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో టీచర్ భర్త.. బాలికపై కన్నేశాడు. ఆమెను లైంగికంగా వేధించేవాడు. ప్రతిరోజు తన కోరిక తీర్చాలంటూ టార్చర్ చేసేవాడు.

కొందరు ఉపాధ్యాయులు కామాంధులుగా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులకు, విద్యాబుద్దులు చెప్పాల్సిన వారే దారి తప్పుతున్నారు. తమ స్టూడెంట్ లతో నీచమైన పనులు చేస్తున్నారు. బాలికలను తమ మాయ మాటలతో మభ్య పెట్టి లైంగిక అవసరాలను తీర్చుకుంటున్నారు. మరికొందరు.. పాఠశాలలోనే బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మరికొందరు టీచర్లు.. పాఠశాలకు తాగి వచ్చి.. తమ ఉపాధ్యాయ వృత్తికే మాయని మచ్చ తీసుకొస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఒడిశాలోని(Odisha) బాలాసోర్ లో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. ఖైరా బ్లాక్ పరిధిలోని కురంట పంచాయతీలోని బరింగియాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. కాగా, స్థానికంగా ఉన్న తొమ్మిదో తరగతికి చెందిన బాలిక.. తన లేడీ టీచర్ ఇంటికి ట్యూషన్ కు వెళ్లేది. ఈ క్రమంలో లేడీ టీచర్ భర్త జెనె.. బాలిక పై కన్నేశాడు. ఆమెను తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు పాల్పడ్డాడు. అయితే. బాలిక మాత్రం అతని కోరికను తిరస్కరించింది. దీంతో ఆమెపై కోపం పెంచుకుని వేధింపులకు పాల్పడేవాడు. అతని వేధింపులు మరీ ఎక్కువ కావడంతో.. బాలిక ట్యూషన్ వెళ్లడం మానేసింది.

ఈ క్రమంలో ఆదివారం నాడు.. బాలిక ఇంటి నుంచి షాపుకు వెళ్లింది. అక్కడ కాపుకాచి ఉన్న జెనె.. బాలికను బలవంతంగా అక్కడ ఉన్న పాడు బడ్డ భవంతిలోనికి లాక్కెళ్లాడు. ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. బాలిక గట్టిగా అరుస్తూ రోడ్డు మీదకు పరిగెత్తుకుంటు వచ్చింది. దీంతో నిందితుడు భయపడిపోయి పారిపోయాడు. స్థానికులు.. బాలికను కాపాడటానికి ప్రయత్నించారు. కానీ మంటలు శరీరమంతట వ్యాపించాయి. దీంతో బాలిక కుప్పకూలిపడిపోయింది. వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాలిక చికిత్స అందిస్తుండగా చనిపోయింది. మరో వైపు నిందితుడు జెనా పురుగుల మందు తాగినట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా..  కొందరు తల్లిదండ్రులు.. పసిపిల్లలని కూడా చూడకుండా దాడులకు పాల్పడుతుంటారు.

ఇష్టమోచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. తెలిసి తెలియని తనంతో వారు.. ఏదైన తప్పులు చేస్తే.. అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది. మధ్య ప్రదేశ్ లో (Madhya pradesh)  అమానుష ఘటన జరిగింది. ఇండోర్ లో (Indore) జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. తొమ్మిదేళ్ల బాలికను, స్థానికంగా ఉన్న దంపతులు దత్తత తీసుకున్నారు. అయితే.. బాలిక నిద్రలో తెలియకుండా పక్క తడిపింది.

దీంతో తల్లి రెచ్చిపోయింది. బాలికను ఇష్టమోచ్చినట్లు కొట్టి, గాయపర్చింది. అంతటితో ఆగకుండా.. బాలిక ప్రైవేటు భాగాలలో వాతలు పెట్టింది. దీంతో బాలిక తన బంధువులకు, పెంపుడు తల్లి చేస్తున్న టార్చర్ ను చెప్పుకుంది. ఈ క్రమంలో బాలిక తనకు, శరీర భాగాలకు తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే వారు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Crime news, Odisha

ఉత్తమ కథలు