అనంతలో అమానుషం... బాలిక గుండెలపై తన్ని కర్రతో బాదిన ఊరి పెద్ద

ఇరు కుటుంబాల తల్లిదండ్రులు వారిని పిలిపించి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఆ తర్వాతే అది అమానవీయంగా తయారైంది. గ్రామ పెద్ద, మాజీ ఎంపీటీసీ లింగప్ప రెచ్చిపోయాడు.

news18-telugu
Updated: August 17, 2019, 10:37 AM IST
అనంతలో అమానుషం... బాలిక గుండెలపై తన్ని కర్రతో బాదిన ఊరి పెద్ద
minor girl attacked by village elders in anantapur
  • Share this:
అనంతపురం జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికను గ్రామపెద్దలు పంచాయితీ పెట్టి చావాబాదరు. ఇద్దరు మైనర్లు ప్రేమించుకున్నారు. వాళ్ల ప్రేమను పెద్దలు ఒప్పుకోరని తెలిసి ఊరి నుంచి పారిపోయారు. ఇది తెలిసిన కుటుంబసభ్యులు ఇద్దర్నీపట్టుకొని గ్రామంలో పంచాయితీ పెట్టారుగుమ్మఘట్ట మండలంలోని కేపీదొడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరు కుటుంబాల తల్లిదండ్రులు వారిని పిలిపించి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఆ తర్వాతే అది అమానవీయంగా తయారైంది. గ్రామ పెద్ద, మాజీ ఎంపీటీసీ లింగప్ప రెచ్చిపోయాడు.

పెద్దల మాట విననంటావా అంటూ కర్రతో బాలిక విచక్షణారహితంగా కొట్టాడు.  బాలిక రెండు చెంపలపై కూడా తీవ్రంగా కొట్టాడు. అక్కడితో ఆగకుండా కర్రతో గొడ్డును బాదినట్టు బాదుతూ, కాళ్లతో బాలిక గుండెలపై తంతూ వీరంగమేశాడు. బాలికనే ప్రేమించిన యువకుడిపైనా, బాలిక తండ్రిపై ూడా తన ప్రతాపం చూపించాడు. పంచాయితీకి వచ్చిన ఇతర పెద్దలు, చుట్టూ వున్న వందమంది జనం సినిమా చూస్తున్నట్టు చూశారే తప్పా ఎవరూ కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే ఈ తతంగం మొత్తాన్ని అక్కడున్న యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

లింగప్ప శివాలెత్తడం మీడియాకెక్కడంతో ఈ కిరాతకం వెలుగుచూసింది. సోషల్ మీడియాలోనూ ఈ వీడియో వైరల్ అయింది. ఇంత జరిగినా ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు పోలీసులు.

First published: August 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading