news18-telugu
Updated: November 5, 2020, 6:12 AM IST
ప్రతీకాత్మక చిత్రం
ఓ మైనర్ బాలికపై ఆమె అక్క భర్త ఏడేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమెకు ఆశ్రయం ఇచ్చిన అతడు ఈ దారుణానికి ఓడిగట్టాడు. తను ఎదుర్కొంటున్న పరిస్థితులను ఆ బాలిక స్నేహితురాలికి చెప్పుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. 2014లో బాలికకు 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో ఆ బాలిక, ఆమె అన్నయ్య ఒంటరిగా మారారు. ఈ క్రమంలోనే బాలిక అక్క, బావ వారిద్దరిని ఇంటికి తీసుకెళ్లి ఆశ్రయం కల్పించారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కొన్ని వారాలకే బాలికను ఆమె బావ రేప్ చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. అతడి స్నేహితుడికి చెందిన ఓ ఇంట్లో పలుమార్లు బాలికపై అత్యాచారం చేశాడు.
అయితే కొన్నేళ్ల క్రితం బాలిక అన్నయ్యకు ఉద్యోగం వచ్చింది. దీంతో ఆ బాలిక, ఆమె అన్న వేరే చోటకు షిఫ్ట్ అయ్యారు. బాలిక కొద్ది నెలల నుంచి ఎన్జీవోతో కలిసి పనిచేస్తుంది. ఈ క్రమంలోనే తన బాధను బాలిక ఓ స్నేహితురాలికి చెప్పింది. దీంతో బాలిక తన బావ చేతిలో హింసకు గురైందనే విషయాన్ని ఆమె స్నేహితురాలు.. ఆ ఎన్జీవో సభ్యులకు తెలిపింది. ఈ క్రమంలో ఎన్జీవో సభ్యులు బాలికతో మాట్లాడారు. అయితే వారితో జరిగిన విషయాలు చెప్పేందుకు బాలిక తొలుత భయపడింది. ఆ తర్వాత వారు ఇచ్చిన ధైర్యంతో టీటీ నగర్ పోలీసు స్టేషన్లో తన బావపై ఫిర్యాదు చేసింది.
బాలిక ఫిర్యాదుతో ఆమె బావపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని త్వరలోనే అతన్ని అరెస్ట్ చేస్తామని తెలిపారు.
Published by:
Sumanth Kanukula
First published:
November 5, 2020, 6:12 AM IST