సినిమాల ఎఫెక్టో, లేక మొబైల్ ప్రభావమో తెలీదు కానీ అన్యంపున్యం తెలియని వయసులో పిల్లల మనస్సుల్లో విషం నిండుతోంది. అల్లరి చేస్తూ ఆడుకోవాల్సిన వయసులో అఘాయిత్యాలకు, అత్యాచారాలకు ఒడిగడుతున్నారు బాలలు. హాస్టల్‌లో స్నానం చేస్తున్న అమ్మాయిల నగ్నవీడియోలు తీస్తున్న ఓ కుర్రాడి ఉదంతం హైదరాబాద్ నగరంలో వెలుగు చూడగా... తాజాగా మధ్యప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. భోపాల్ నగరంలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడింది ఎవ్వరో కాదు... స్వయానా ఆమె క్లాస్‌మేట్... అంటే మూడో తరగతి చదువుతున్న ఓ 8 ఏళ్ల కుర్రాడు. గురువారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం క్రియేట్ చేసింది. స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థికి రక్తస్రావం కావడంతో చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. పాపను పరీక్షించిన వైద్యులు... అత్యాచారం జరిగిన విషయం చెప్పడంతో షాక్‌కు గురయ్యారు.
గురువారం ఉదయం స్కూల్‌కి వెళ్లిన చిన్నారి... సాయంత్రం కాస్త ఆలస్యంగా ఇంటికి వచ్చింది. ఆమె వచ్చే దారిలో ఇంటికి సమీపంలోనే చిన్నారిపై అత్యాచారం జరిగినట్టు సమాచారం. 8 ఏళ్ల కుర్రాడితో పాటు మరో గుర్తుతెలియని కుర్రాడు కూడా బాలికపై అత్యాచారం చేసినట్టు అనుమానిస్తున్నారు. పాపతో మాట్లాడుకుంటూ వచ్చి... ఖాళీ ప్రదేశంలో అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు అనుమానిస్తున్నారు. పాప్‌పై దారుణానికి ఒడిగట్టిన కుర్రాడితో పాటు అతని తల్లిదండ్రులను పోలీసులు విచారించారు. ఐపీసీ సెక్షన్ 376తో పాటు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు... బాలిక మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవి కూడా చదవండి...
ఇన్‌స్పెక్టర్ కూతురిపై గ్యాంగ్ రేప్... బీటెక్ విద్యార్థుల ఘనకార్యం
క్రమశిక్షణ పేరిట వికృత చేష్టలు...ఎండలో నగ్నంగా నిలబెట్టారు
భార్యతో గొడవ... ప్రాణం తీసుకున్న ఎయిమ్స్ డాక్టర్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.