దేశంలో ఎన్ని చట్టాలు(Laws) వచ్చినా మేము మారం.. మేమింతే.. మీరు ఏమైనా చేసుకోండి.. మా పని మేము చేసుకుంటాం అన్నట్లు తయారు అయ్యారు కామాంధులు. చిన్న లేదు పెద్దా లేదు.. ఎవరిని అయినా వారిపై అఘాయిత్యాలకు పాల్పడి ప్రాణాలను తీయడానికి సైతం వెనకాడం లేదు ఈ మృగాళ్లు. చిన్నపిల్ల దగ్గర నుంచి ముసలి వాళ్ల వరకు కనికరం లేకుండా.. ఏ మాత్రం జాలి లేకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. ఎన్ని కఠిన శిక్షలు విధించనా హత్యలు, ఆడవాళ్లపై యాసిడ్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ మైనర్ బాలిక(Minor Girl)ను సామూహికంగా అత్యాచారం(Gang Rape) చేశారు ఓ ముగ్గురు కామాంధులు(Lustful). అందులో బీజేపీ లీడర్ మరొకరు జేడీయూ కార్యకర్త కూడా ఉండటం గమనార్హం. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హర్యానాకు చెందిన 17 ఏళ్ల బాలిక(girl) తన బంధువు పారుల్(Paurul) ఇంటికి వచ్చింది. వాళ్లు మధ్యప్రదేశ్(Madhyapradesh) లోని అశోకనగర్(Ashoknagar) లో నివాసం ఉంటున్నారు. ఒక రోజు పారుల్ తన స్నేహితులు ఎంపీ నగర్‌లోని ఒక హోటల్ లో పార్టీ చేసుకుంటుండగా.. ఆ బాలికను తీసుకెళ్లింది. ఆ హోటల్ లో వాళ్లు పార్టీలో మందు సేవించి ఎంజాయ్ చేస్తున్నారు.
Madhya Pradesh | 3 people arrested for allegedly raping a minor at a hotel room
The girl was brought from Agra by a woman. In her complaint, she levelled rape allegations against 3 people, all three arrested from Dindori on the basis of hotel footage: Bhopal SP Sai Krishna Thota pic.twitter.com/BIrCZ9kPLK
— ANI (@ANI) September 9, 2021
అక్కడే ఉన్న మరో నలుగురు వ్యక్తులు ఆ బాలికను బలవంతంగా రూంకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. దీంతో ఆ బాలిక అశోక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి నిందితులు తెలియకపోవడంతో.. పోలీసులు సంఘటనా స్థలంలోని రికార్టు అయిన సీసీటీవీల ద్వరా నిందితులను గుర్తించారు. హోటల్‌లో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా డిండోరిలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు భోపాల్ ఎస్పీ సాయి కృష్ణ తోట తెలిపారు.
భోపాల్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినందుకు గాను బిజెపి నాయకుడు మరియు జనతాదళ్ (యునైటెడ్) నాయకుడితో సహా మిగిలిన వ్యక్తులను దిండోరి జిల్లా నుండి అరెస్టు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిందితులను మనీష్ నాయక్, దినేష్ అవధియా మరియు అమిత్ సోనిగా గుర్తించారు. మనీష్ నాయక్ దిండోరి జిల్లా బిజెపి కార్యాలయ కార్యదర్శి కాగా, దినేష్ అవధియా డిండోరిలో జెడియు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు.
నిందితుల్లో ఒకరైన దిండోరి బీజేపీ ఆఫీస్ ఇన్‌ఛార్జ్ మనీష్ నాయక్ ప్రాథమిక సభత్వాన్ని రద్దు చేసినట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఈ కేసులో మరో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. వారి ప్రమేయం ఉన్నట్లు తేలితే.. వాళ్లను కూడా అరెస్టు చేసి విచారిస్తామని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Madhyapradesh