మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్...ఆమెకే గుండు గీయించిన ఊరి పెద్దలు

నిందితుల పేరెంట్స్ ఊర్లో పేరుమోసిన వారు కావడంతో బాధితురాలే తప్పు చేసిందని తీర్పు ఇచ్చారు. తప్పు చేసినందుకు శిక్షగా.. ఆమెకు గుండు గీయించి వీధుల్లో ఊరేగించారు.

news18-telugu
Updated: August 27, 2019, 6:56 PM IST
మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్...ఆమెకే గుండు గీయించిన ఊరి పెద్దలు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 27, 2019, 6:56 PM IST
మారుమూల గ్రామల్లో ఊరి పెద్దలు, కుల పెద్దల పెత్తనమే నేటికీ కొనసాగుతోంది. అనాగరిక తీర్పులు...ఆటవిక శిక్షలతో .. అంతా నా ఇష్టమంటూ చెలరేగిపోతున్నారు. అడ్డగోలు పంచాయితీలు పెట్టి పేదల జీవితాలతో చెలగాడుతున్నారు. తాజాగా బీహార్‌లోని గయా జిల్లాలో మరో దారుణం జరిగింది. అత్యాచార బాధితురాలికి న్యాయం చెయాల్సిన ఊరిపెద్దలు..తిరిగి ఆమెనే శిక్షించారు. అందరు చూస్తుండగా గుండు గీయించి గ్రామ వీధుల్లో ఊరేగించారు. అంతేకాదు బాలిక కుటుంబ సభ్యుల్లో ఎవరూ ఊరి విడిచి వెళ్లకూడదని ఆదేశించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఆగస్టు 14న గ్రామంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. కొందరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి పంచాయతీ కార్యాలయం మిద్దెపైకి తీసుకెళ్లారు. అనంతరం ఒకరి తర్వాత మరొకరుగా ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో పడిఉన్న ఆ బాలికను కొందరు స్థానికులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారమివ్వడంతో వారు ఇంటికి తీసుకెళ్లారు.

తమ కూతురికి జరిగిన అన్యాయంపై తల్లిదండ్రులు గ్రామ పంచాయతీని ఆశ్రయించారు. ఐతే బాధితురాలికి న్యాయం చేయాల్సిన ఊరి పెద్దలు నిందితులకు వంతపాడారు. నిందితుల పేరెంట్స్ ఊర్లో పేరుమోసిన వారు కావడంతో బాధితురాలే తప్పు చేసిందని తీర్పు ఇచ్చారు. తప్పు చేసినందుకు శిక్షగా.. ఆమెకు గుండు గీయించి వీధుల్లో ఊరేగించారు. గ్రామస్తుల అందరి సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. కానీ ఏ ఒక్కరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. తమకు న్యాయం జరగకపోవడంతో చివరకు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.First published: August 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...