కృష్ణా జిల్లాలో దారుణం... కూతుర్ని ప్రియుడు వద్దకు పంపిన తల్లి

ఇక ఆ దుర్మార్గుడు ఆ చిన్నారికి రాత్రంతా నరకం చూపించాడు.

news18-telugu
Updated: December 14, 2019, 10:44 AM IST
కృష్ణా జిల్లాలో దారుణం... కూతుర్ని ప్రియుడు వద్దకు పంపిన తల్లి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొందరు అమ్మ అన్న పదానికే మాయని మచ్చలా తయారవుతున్నారు. కన్నపిల్లల్ని పరాయి పంచెకు చేర్చి తమాసా చూస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ కన్నతల్లి... కూతుర్ని వేరే వ్యక్తి వద్దకు పంపింది. రాత్రంతా అతడి వద్దే ఉంచింది. సభ్యసమాజం తలదించుకోవాల్సిన ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. కంచికచర్ల మండలం పరిటాలలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే, మార్తమ్మ అనే తల్లి మైనర్ అయిన తన కన్న కూతురినే తన ప్రియుడు రాంబాబు వద్దకు పంపంది. ఇక ఆ దుర్మార్గుడు ఆ చిన్నారికి రాత్రంతా నరకం చూపించాడు. జరిగిన దారుణాన్ని బాధితురాలు తన నానమ్మకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడు రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న తల్లి మార్తమ్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>