చెల్లిని గదిలో బంధించి.. అక్కపై అత్యాచారం..

ఇద్దరమ్మాయిల్లో పెద్దమ్మాయిని బలవంతంగా పడక గదిలోకి లాక్కెళ్లాడు. అడ్డుకోబోయిన ఆమె చెల్లెలిని పక్క గదిలో బంధించాడు.అనంతరం ఆమె సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.


Updated: August 23, 2019, 8:07 AM IST
చెల్లిని గదిలో బంధించి.. అక్కపై అత్యాచారం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పరిధిలోని కేశవగిరిలో దారుణం జరిగింది. 17 ఏళ్ల ఓ బాలుడు 16ఏళ్ల ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన ఆమె చెల్లెలిని పక్క గదిలో బంధించి మరీ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాధిత బాలిక ఫిర్యాదుతో అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వివరాల్లోకి వెళ్తే.. చాంద్రాయణగుట్ట పరిధిలోని కేశవగిరిలో ఓ కుటుంబం చాలాకాలంగా నివసిస్తోంది. మంగళవారం ఆ కుటుంబానికి చెందిన తల్లి తన కుమారులను

తీసుకుని ఆస్పత్రికి వెళ్లింది. ఆ సమయంలో ఇద్దరు కూతుళ్లు ఇంటి వద్దే ఉన్నారు. ఇది గమనించిన ఓ బాలుడు.. ఇంట్లోకి చొరబడ్డాడు. ఇద్దరమ్మాయిల్లో పెద్దమ్మాయిని బలవంతంగా పడక గదిలోకి లాక్కెళ్లాడు. అడ్డుకోబోయిన ఆమె చెల్లెలిని పక్క గదిలో బంధించాడు.అనంతరం ఆమె సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం తర్వాత అక్కడినుంచి పరారయ్యాడు. కుటుంబ సభ్యులు ఇంటికొచ్చాక జరిగిన ఘటన గురించి బాలిక వారితో చెప్పింది. దీంతో బాలిక తల్లి స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద బాలుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం జువైనల్ హోమ్‌కు తరలించారు.
First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading