news18-telugu
Updated: November 16, 2019, 10:01 PM IST
ప్రతీకాత్మకచిత్రం
తల్లికి అనారోగ్యంగా ఉంటే.. ఆమెకు సాయం చేసేందుకు వచ్చిన మరదలిని మంచానికి కట్టేసి రేప్ చేశాడో బావ. గురుగ్రామ్‌లోని సెక్టార్ 51లో గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల బాలిక మేనత్తకు అనారోగ్యంగా ఉంది. దీంతో అత్తకు ఇంటి పనుల్లో కొంచెం సాయం చేయమంటూ తల్లి కూతుర్ని వారి ఇంటికి పంపింది. అయితే, అత్త డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న మరదలి మీద 16 ఏళ్ల బావ కన్నేశాడు. ఆమెను బెడ్రూంలోకి తీసుకెళ్లి కాళ్లు, చేతులు మంచానికి కట్టేసి.. ఆమె మీద అత్యాచారం చేశాడు. అయితే, ఈ విషయం తన తల్లికి చెప్పొద్దని బెదిరించాడు. ఆ తర్వాత రోజు బాలిక స్కూల్‌కి వెళ్లినప్పుడు కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో టీచర్ విషయాన్ని ఆరా తీస్తే.. కన్నీళ్లు పెట్టుకుంటూ బాలిక తన మీద బావ చేసిన అఘాయిత్యం గురించి టీచర్‌కు చెప్పింది. దీంతో టీచర్, బాలికను తీసుకుని వెళ్లి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 16, 2019, 10:01 PM IST