Home /News /crime /

MINOR BOY BRUTALLY ATTACKED 12 YEAR OLD GIRL FOR RESISTING RAPE BID IN UTTAR PRADESH SK GH

మైనర్ బాలికను రేప్ చేయిబోయిన బాలుడు.. ఆమె అడ్డుకుందని ఏం చేశాడంటే.. సీసీటీవీలో దృశ్యాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా.. ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. కోపంతో ఊగిపోయిన ఆ బాలుడు ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటనలో బాధితురాలికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

దేశంలో యువతులు, మైనర్ బాలికలపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది. లైంగిక దాడిని అడ్డుకున్నందుకు 12 ఏళ్ల బాలికను తీవ్రంగా హింసించాడు ఒక మైనర్ బాలుడు. తనపై అత్యాచారం చేయాలనే ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకు బాలికను అతడు తీవ్రంగా కొట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో బాధితురాలికి తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమెకు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. నిందితుడు, బాధితురాలుఇద్దరూ ఇరుగుపొరుగు వారని తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో.. మజోలా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ప్రాంతంలో వీరి కుటుంబాలు నివసిస్తున్నాయి.

సదరు బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా.. ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో కోపంతో ఆమెను బాలుడు దారుణంగా కొట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ తరువాత బాలిక స్పృహ కోల్పోగా, భయపడ్డ బాలుడు బైక్ మీద పారిపోయాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాలికను తీవ్రంగా కొట్టిన నిందితుడిని పట్టుకోవాలని స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ఈ వీడియో బయటకు రావడంతో ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు.

ఈ సంఘటన తరువాత బాలికను మొరాదాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యులు ఆమెకు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. బాలికపై దాడి చేసిన మైనర్ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర ప్రదేశ్ బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ విశేష్ కుమార్ గుప్తా డిమాండ్ చేశారు. బాలికను హింసించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని మొరాదాబాద్ పోలీసులకు ఆయన లేఖ రాశారు. ఈ కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేయాలని కమిషన్ పోలీసులను ఆదేశించింది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Crime news, Minor rape, Sexual harrassment, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు