హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking : మైనర్ బాలుడిపై కార్మికులు అరాచకం..మిక్సింగ్ మిషన్ కి కట్టేసి దారుణంగా..

Shocking : మైనర్ బాలుడిపై కార్మికులు అరాచకం..మిక్సింగ్ మిషన్ కి కట్టేసి దారుణంగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Minor boy beaten : మహారాష్ట్ర(Maharashtra)లో అమానవీయ ఘటన జరిగింది. ఇనుప చువ్వలు దొంగలించాడనే అనుమానంతో 17 ఏళ్ల యువకుడిపై కర్కశత్వం ప్రదర్శించారు కార్మికులు. సిమెంట్-ఇసుక మిక్సింగ్ మిషన్‌ కి అతడి చేతులు, కాళ్లు తాళ్లతో కట్టేసి దారుణంగా కొట్టారు.

ఇంకా చదవండి ...

Minor boy beaten : మహారాష్ట్ర(Maharashtra)లో అమానవీయ ఘటన జరిగింది. ఇనుప చువ్వలు దొంగలించాడనే అనుమానంతో 17 ఏళ్ల యువకుడిపై కర్కశత్వం ప్రదర్శించారు కార్మికులు. సిమెంట్-ఇసుక మిక్సింగ్ మిషన్‌ కి అతడి చేతులు, కాళ్లు తాళ్లతో కట్టేసి దారుణంగా కొట్టారు. ముంబ్రా మే 31న జరిగిన ఈ జరిగిన ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన యువకుడిని ట్రీట్మెంట్ నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. మైనర్ బాలుడిని కార్మికులు మిక్సింగ్​ మిషన్​కు కట్టేసి కొడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. ఇటువంటి అమానవీయ చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి హత్యాయత్నం సహా ఏడు సెక్షన్ల కింద ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఇద్దరిని విచారణ బృందం అరెస్టు చేసింది. కోర్టులో హాజరుపరిచిన నిందితులకు జూన్ 10 వరకు పోలీసు కస్టడీ విధించారు. పోలీసులు మిగతావారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరోవైపు, ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) అమానవీయకర సంఘటన జరిగింది. పశువులను దొంగిలించాడని కేసుపై, బడాయున్ పోలీసులు రెహాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో స్టేషన్ అధికారి,మిగతా పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. లాఠీలతో కొడుతు, అతని ప్రైవేటు పార్ట్ లలో కుళ్లబొడిచాడు. అంతటితో ఆగకుండా, కరెంట్ షాక్ ఇచ్చారు. కాగా, బాధితుడిని చూడటానికి అతని బంధువులు వచ్చినప్పుడు ఈ ఉదంతం వెలుగులోనికి వచ్చింది.

ALSO READ Pet dog : విశ్వాసం అంటే ఇదే మరి..యజమానిని రక్షించి ప్రాణాలు కోల్పోయిన కుక్క


 పోలీసులు.. రెహన్ ను విడిచిపెట్టాలంటే... 5వేలు కావాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే స్టేషన్ బెయిల్ ఇస్తామని అన్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు అడిగినంత ఇచ్చుకుని తమ కొడుకుని ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత.. జరిగిన దారుణాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్ అయిన అధికారులు.. స్టేషన్ ఇన్ చార్జితో పాటు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు నలుగురిని సస్పెండ్ చేశారు. బాధితుడు.. దొంగతనం కేసులో నిందితుడిని పోలీసులు గత నెలలో అదుపులోకి తీసుకున్నారు. అతను పశువుల స్మగ్లర్ల బృందానికి సహాయం చేస్తున్నాడని పోలీసులు ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Maharashtra

ఉత్తమ కథలు