లైంగిక వాంఛ తీర్చమని అన్నభార్యను సైతం వదలని మైనర్ బాలుడు... చివరికి ఏం జరిగిందంటే..?

గత వారం ఇంట్లో ఎవరూ లేన సమయంలో నిందితుడు తన వదినపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధిత మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది. అయితే తన మాట వినడం లేదని తన పశువాంఛ తీర్చుకునే క్రమంలో పైశాచికత్వంతో వదిన గొంతు నులిమాడు. ఆమె, ఊపిరాడక ప్రాణం విడిచింది.

news18-telugu
Updated: June 11, 2019, 8:05 PM IST
లైంగిక వాంఛ తీర్చమని అన్నభార్యను సైతం వదలని మైనర్ బాలుడు... చివరికి ఏం జరిగిందంటే..?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 11, 2019, 8:05 PM IST
కుటుంబ సంబంధాలకే కళంకంలా మారిన ఘటన సెంట్రల్ ఢిల్లీలో చోటుచేసుకుంది. సొంత అన్న భార్యపైనే ఓ మైనర్ బాలుడు లైంగిక దాడితో పాటు హత్య చేసిన ఘటనతో పరిసర ప్రాంతాలు ఉలిక్కి పడ్డాయి. వివరాల్లోకి వెళితే బాధిత మహిళ బీహార్ లోని ముజఫర్ పుర్ నుంచి వలస వచ్చి సెంట్రల్ ఢిల్లీలో ప్రేం నగర్ లో నివాసముంటున్నారు. బాధిత మహిళ భర్త, వారి ఏకైక సంతానం నాలుగేళ్ల బాలుడితో కలిసి ఉంటున్నారు. అయితే అడపదడపా వారి స్వస్థలం నుంచి మరిది కూడా ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఢిల్లీలో కూరగాయలు అమ్మడమే జీవనోపాధిగా బాధిత మహిళ కుటుంబం జీవనం సాగిస్తోంది. అయితే చుట్టపు చూపుగా బీహార్ నుంచి తరచూ వచ్చే మరిది, తనపై కన్నేసాడని గమనించింది. వయస్సులో చిన్నవాడైనప్పటికీ అతడి ప్రవర్తన మాత్రం శృతిమించినట్లే ఉందని బాధిత మహిళ పలుమార్లు గమనించి భర్తతో చెప్పింది. తన స్వంత సోదరుడు అలాంటి వాడు కాదని పలుమార్లు అతను తన భార్యను వారించినట్లు స్థానికులు తెలిపారు. అయితే బాధితురాలి భర్త ఇంట్లో లేని సమయంలో మరిది ప్రవర్తనతో విసుగు చెందిన వదిన, అతడిని పలుమార్లు హెచ్చరించింది. అయితే తన లైంగిక వాంఛను తీర్చితే ఏమి చేయనని, లేకుంటే తన కుటుంబాన్ని నాశనం చేస్తానని బాధిత మహిళ మరిది హెచ్చరించాడు.

ఇదిలా ఉంటే...గత వారం ఇంట్లో ఎవరూ లేన సమయంలో నిందితుడు తన వదినపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధిత మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది. అయితే తన మాట వినడం లేదని తన పశువాంఛ తీర్చుకునే క్రమంలో పైశాచికత్వంతో వదిన గొంతు నులిమాడు. ఆమె, ఊపిరాడక ప్రాణం విడిచింది.  దీంతో ఏం చేయాలో పాలు పోని నిందితుడు.. మృతురాలి నాలుగేళ్ల కుమారుడిని సైతం గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఇరు మృత దేహాలకు చీరతో ఉరి వేసి ఫ్యానుకు తగిలించి చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. రాత్రివేళ ఇంటికి వచ్చి మృతురాలి భర్త తన భార్య, కుమారుడు మరణించడంతో హతాశుడయ్యాడు. అనంతరం పోలీసులు వచ్చి విచారణ చేయగా, మృతురాలి శరీరంపై ఉన్న గుర్తులు, అలాగే బాలుడి మెడపై ఉన్న బలమైన గాయం గుర్తించి, హత్యగా నిర్ధారించారు. అనంతరం అనుమానితుడిగా మృతురాలి మరిదిని విచారించేందుకు మైనర్ బాలుడిని బీహార్ లోని ముజఫర్ పూర్ లో అరెస్టు చేసి ఢిల్లీ తరలించగా, అసలు విషయం బయటపడింది. స్వంత తమ్ముడే వదినను లైంగిక వాంఛ తీర్చమని, వెంటపడి మొత్తం కుటుంబాన్నే కడతేర్చడంతో బాధిత మహిళ భర్త కన్నీరుమున్నీరయ్యడు.

First published: June 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...