మహిళను రేప్ చేసి చంపేసిన మైనర్ బాలుడు.. ఇద్దరు అరెస్ట్

కొన్ని రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా.. ఫిబ్రవరి 10న పోర్వోరిమ్ అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. మృతురాలు స్వస్థలం ఒడిశా అని.. గత కొద్ది కాలంగా గోవాలో నివసిస్తోందని పోలీసులు తెలిపారు.


Updated: February 14, 2020, 10:50 PM IST
మహిళను రేప్ చేసి చంపేసిన మైనర్ బాలుడు.. ఇద్దరు అరెస్ట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. కఠిన చట్టాలు తెచ్చినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. తాజాగా గోవాలో మరో దారుణం వెలుగుచూసింది. 28 ఏళ్ల మహిళను అత్యాచారం చేసి అనంతరం కిరాతకంగా చంపేశారు. కొన్ని రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా.. ఫిబ్రవరి 10న పోర్వోరిమ్ అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. మృతురాలు స్వస్థలం ఒడిశా అని.. గత కొద్ది కాలంగా గోవాలో నివసిస్తోందని పోలీసులు తెలిపారు.

ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ మహిళను 16 ఏళ్ల బాలుడితో పాటు మరో వ్యక్తి కలిసి రేప్ చేసి చంపేశారని పోర్వోరిమ్‌ డీఎస్పీ ఎడ్విన్‌ కోలాకో చెప్పారు. వీరిద్దరు ఆమెపై అత్యాచారం చేసి.. అనంతరం హత్య చేశారని పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని ఆయన తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరికి మరో వ్యక్తి సహకరించాడని.. అతడి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.

First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు