Home /News /crime /

MINOR ALLEGEDLY RAPED FOR 6 DAYS IN BENGALURU COPS ARREST SIX INCLUDING TWO WOMEN PVN

Rape On Minor : ఆరు రోజులుగా బాలికపై అత్యాచారం..ఇద్దరు మహిళలు కూడా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Minor Girl Rapped : 16 ఏళ్ల బాలిక స్కూల్ అయిపోయిన తరువాత టైలరింగ్ నేర్చుకునేందుకు తరచుగా వారి దగ్గరకి వెళ్లేది. ఫిబ్రవరి 28 మధ్యాహ్నం రాజేశ్వరి.. ఆ బాలికకు జ్యూస్​ లో మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసింది. ఈ క్రమంలో కేశవమూర్తి అనే వ్యక్తి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఇంకా చదవండి ...
Bengaluru Minor Rape case : బెంగళూరులో దారుణం జరిగింది. ఓ పదహారేళ్ల బాలిక మీద ఆరు రోజులుగా సామూహిక అత్యాచారం జరిగింది. బెంగుళూరులోని హెచ్​ఎస్​ఆర్​ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాలిక ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడాన్ని గమనించిన బాలిక తల్లి ఆమెను వైద్యుడి వద్దకు తీసుకెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలికపై పలుమార్లు అత్యాచారం జరిగినట్లు వైద్య నివేదికలు నిర్ధారించాయి. బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనకు సంబంధించి ఆరుగురుని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులికి సహకరించిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.

బెంగళూరులోని బండేపాల్యలో రాజేశ్వరి, కళావతి అనే ఇద్దరు మహిళలు టైలరింగ్ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. 16 ఏళ్ల బాలిక స్కూల్ అయిపోయిన తరువాత టైలరింగ్ నేర్చుకునేందుకు తరచుగా వారి దగ్గరకి వెళ్లేది. ఫిబ్రవరి 28 మధ్యాహ్నం రాజేశ్వరి.. ఆ బాలికకు జ్యూస్​ లో మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసింది. ఈ క్రమంలో కేశవమూర్తి అనే వ్యక్తి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికి చెప్పవద్దని రాజేశ్వరి.. బాధితురాలిని బెదిదించింది. రెండు రోజుల తర్వాత రాజేశ్వరి..బాధిత బాలికను కళావతి ఇంటికి తీసుకువెళ్లింది. అక్కడ రఫిక్, సత్యరాజ్, శరత్, రాజేష్ అనే యువకులు నాలుగు రోజులుగా పలుమార్లు బాలికపైఅత్యాచారానికి పాల్పడ్డారు. శారీరకంగా, మానసికంగా హింసించారు.

ALSO READ భర్త ముందే ప్రియుడితో సంబంధం కొనసాగించిన భార్య.. కానీ చివరకు ఓ రోజు ఏం జరిగిందే..

నాలుగు రోజుల తర్వాత బాలిక అనారోగ్యానికి గురికావడం వల్ల.. బాధితురాలు తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పింది. అదే రోజు రాత్రి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు దుండగులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రాజేశ్వరి, కళావతి ఇద్దరూ. ఫిర్యాదు అందడంతో నగరం విడిచి పారిపోయారని... మార్చి 7 సాయంత్రం నగర శివార్లలో వారిని పట్టుకుని విచారించిన తరువాత నలుగురు వ్యక్తుల వివరాలను సేకరించి ఒకరి తర్వాత ఒకరిగా. వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఆరుగురుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని..వారందరినీ మార్చి 8 న కోర్టు ముందు హాజరుపర్చామని... వారు ఇప్పుడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు అని ఒక దర్యాప్తు అధికారి తెలిపారు. కళావతి, రాజేశ్వరి ఇద్దరూ.. డబ్బుల కోసం నిందితులకు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు.

ALSO READ Lovers: సరదాగా బీచ్ కు వెళ్లిన ప్రేమజంట.. ప్రియుడ్ని కట్టేసి యువతిపై దారుణం..

హోసూరుకు చెందిన నిందితుడు కేశవమూర్తి ఓ ఆటోమొబైల్ కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కోరమంగళకు చెందిన సత్యరాజు కాంట్రాక్టర్‌. యలహంకకు చెందిన శరత్, బేగూర్‌ కు చెందిన రఫీక్ వ్యాపారులు. రాజేశ్వరి, కళావతి సెక్స్ వర్కర్లని, బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన తర్వాత వారి నుంచి డబ్బులు తీసుకున్నారని పోలీసులు తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Bengaluru, Crime news, Minor girl raped

తదుపరి వార్తలు