MINISTER NARAYANA PRASADS SON FIRING ON LOCALS IN BIHAR VIDEO GOES VIRAL SNR
ఆడుకునే పిల్లలపై కాల్పులు జరుపుతాడా..ఆ మంత్రి కొడుక్కి ఎంత కండ కావరం
Photo Credit:Youtube
Bihar: బీహార్ పర్యాటకశాఖ మంత్రి నారాయణప్రసాద్ కుమారుడు తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన సంచలనంగా మారింది. తోటలో ఆడుకుంటున్న పిల్లల్ని వెళ్లగొట్టే విషయంలో స్థానికులతో జరిగిన వాగ్వాదం కాల్పులకు దారి తీసింది. ఈ గొడవలో నలుగురు గాయపడ్డారు. బాధితుల బంధువులు మంత్రి కారును ధ్వంసం చేశారు.
బీహార్(Bihar)లో ఓ మంత్రి కొడుకు తుపాకీతో కాల్పులు జరపడం సంచలనంగా మారింది. నౌతన్(Nautan) నియోజకవర్గ ఎమ్మెల్యే బీహార్ పర్యాటకశాఖ మంత్రి (Tourism minister) నారాయణప్రసాద్ (Minister Narayana Prasad)కుమారుడు బబ్లూ ప్రసాద్ తమ ఇంటికి సమీపంలో ఉన్న మామిడి తోట దగ్గర ఆడుకుంటున్న పిల్లలను అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశాడు. అందుకు వాళ్లు నిరాకరించడంతో వారితో ఘర్షణ పడ్డాడు. మంత్రి తనయుడు దూకుడుగా వ్యవహరించడంతో అక్కడున్న స్తానికులు అతడ్ని వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. ఈక్రమంలోనే అతడిపై రాళ్లు రువ్వారు. అక్కడి నుంచి వెళ్లిపోయిన మంత్రి నారాయణప్రసాద్ (Narayana Prasad)కుమారుడు బబ్లూ ప్రసాద్ (Bablu prasad)తన అనుచరవర్గంతో వాహనాల్లో వచ్చి స్థానికులపై దాడి చేశాడు. తుపాకీతో గాల్లో కాల్పులు జరిపాడు. ఈఘటనలో నలుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహంతో మంత్రి ఇంటిపైకి దాడి చేయడానికి వెళ్లారు. అక్కడున్న మంత్రి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇదంతా జరుగుతుండగానే మంత్రి కుమారుడు బబ్లూప్రసాద్ అక్కడి నుంచి పారిపోయాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్పాట్‌కి చేరుకున్నారు. మంత్రి ఇంటి దగ్గర ఓ తుపాకితో పాటు ఓ రైఫిల్‌ని స్వాధీనం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు.
మంత్రి కొడుకుపై స్థానికులు ఆగ్రహం..
ఈకేసులో పోలీసులు మంత్రి కుమారుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు, బాధితులు మండిపడుతున్నారు. అయితే తోటలో మంత్రి కుమారుడు, పిల్లలకు మధ్య జరిగిన ఘర్షణ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అసలు గొడవకు కారణం ఏమిటని పోలీసులు విచారిస్తే మంత్రి కొడుకు పర్సనల్ గార్డ్‌తో తోటకు వెళ్లిన సమయంలో స్థానికులు ఆధిపత్యం చలాయించారని..తన భూమికి కబ్జా చేసేందుకు ప్రయత్నించారనేది మంత్రి నారాయణ ప్రసాద్ ఆరోపణ. గ్రామస్తులు ముందుగా తన కుమారుడు, మేనల్లుడిపై దాడికి పాల్పడ్డట్లుగా ఆరోపించారు. అటుపై బబ్లూ ప్రసాద్ తన దగ్గరున్న లైసెన్స్ రివాల్వర్‌తో అక్కడికి వెళ్లాడని అతడిపైనే గ్రామస్తులు రాళ్లతో దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు మంత్రి. గ్రామస్తులు జరిపిన రాళ్ల దాడిలోనే కొందరు గాయపడ్డారని తన కుమారుడి చేతిలో ఉన్న ఆయుధాన్ని కూడా వాళ్లు తీసుకున్నారని తెలిపారు. తన వాహనాన్ని ధ్వంసం చేశారని మంత్రి నారాయణప్రసాద్ తెలిపారు.
దౌర్జన్యం చేసేందుకు వెళ్తేనే ఘర్షణ..
ఈ ఘర్షణపై మంత్రి స్పందన ఇలా ఉంటే స్థానికుల వాదన మరోలా ఉంది. ముందు మంత్రి కుమారుడే తన బిడ్డ జనార్ధన్కుమార్ని దారుణంగా కొట్టాడని ఆరోపించింది అతని తల్లి. మంత్రి కొడుకు చేతిలో దెబ్బలు తిన్న తన కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులకు తెలిపింది. ఈ మొత్తం గొడవలో నలుగురు పిల్లలు గాయపడ్డారు. మంత్రి కుమారుడు తుపాకీ పట్టుకొని జనంపై కాల్పులు జరపడన్న వార్త బీహార్ అంతటా మార్మోగిపోతోంది. మంత్రి నారాయణప్రసాద్ కుమారుడ్ని కొడుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఎపిసోడ్లో ముందు పొరపాటో ఎవరిదో గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.