హోమ్ /వార్తలు /క్రైమ్ /

Srikakulam: సచివాలయంలోనే మైనర్ బాలికపై అత్యాచారం -గ్రామ వాలంటీర్ ఘాతుకం -కూల్‌డ్రిక్‌లో మత్తు మందు కలిపి..

Srikakulam: సచివాలయంలోనే మైనర్ బాలికపై అత్యాచారం -గ్రామ వాలంటీర్ ఘాతుకం -కూల్‌డ్రిక్‌లో మత్తు మందు కలిపి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సచివాలయం సాక్షిగా మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగింది. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి సచివాలయం భవంతిలోనే బాలికను రేప్ చేశాడు ఓ గ్రామ వాలంటీర్. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దురాగతం ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతున్నది. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నడుకూరు గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణంపై జిల్లా పోలీస్ అధికారులు స్పందించారు.

ఇంకా చదవండి ...

(P.Bhanu Prasad, News18, Vizianagaram)

ఆంధ్రప్రదేశ్ లో దారుణ సంఘటన జరిగింది. గ్రామ స్థాయిల్లో పరిపాలన కేంద్రంగా ఉంటోన్న సచివాలయం సాక్షిగా మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగింది. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి సచివాలయం భవంతిలోనే బాలికను రేప్ చేశాడు ఓ గ్రామ వాలంటీర్. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దురాగతం ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతున్నది. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నడుకూరు గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణంపై జిల్లా పోలీస్ అధికారులు స్పందించారు. గ్రామ వాలంటీర్ తోపాటు అతనికి సహకరించిన సచివాలయ సిబ్బంది మరొకరిపైనా పోక్సో చట్టం కింద కేసులు పెట్టారు. ప్రస్తుతం నిందితులిద్దరూ పరారీలో ఉన్నట్లు ప్రచారంలో ఉన్నా, వాళ్లను పోలీసులే అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి..

గ్రామాలు, పట్టణాలు, నగరాలలో ప్రభుత్వ పాలనను కింది స్థాయిలోనూ అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ తీసుకువచ్చిన సచివాలయాలలో పనిచేసే వాలంటీర్ల తీరు కొన్ని వివాదాస్పదమవుతుండటం తెలిసిందే. ప్రభుత్వ పథకాలను ప్రతి గడపకు చేర్చాల్సిన వాలంటీర్లు కొన్ని చోట్ల అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం మండలం నడుకూరులో గ్రామ వాంటీర్ గా పనిచేస్తోన్న యువకుడు.. ఏకంగా గ్రామ సచివాలయం బిల్డింగ్ లోనే మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి బాలికను సచివాలయం లోనికి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటకు సంబంధించి బాధితురాలి తల్లిదండ్రులు శనివారం నాడు వీరఘట్టం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో వలంటీర్‌తో పాటు ఆతనికి సహకరించిన మరొకరిపై కూడా పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.

వీరఘట్టం మండలంలోని నడుకూరు గ్రామానికి చెందిన వాలంటీర్‌ బి.హరిప్రసాద్‌.. తన ఇంటి సమీపంలో ఉన్న 12 ఏళ్ల బాలికపై గత నెల 31న అత్యాచారం చేశాడు. అదే గ్రామానికి చెందిన అతని స్నేహితుడు రాంబాబు హరిప్రసాద్‌కు సహకరించాడు. రాంబాబు కూడా అదే సచివాలయంలో ప్రైవేటు కంప్యూటర్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో సచివాలయంలో ఉద్యోగులు, సిబ్బంది ఎవరూ రాలేదు. సచివాలయ తాళాలు రాంబాబు వద్దే ఉంటాయి. దీంతో వాలంటీర్‌ హరిప్రసాద్‌.. రాంబాబుతో కలిసి సచివాలయాన్ని తెరిచారు. హరిప్రసాద్‌.. బాలికకు మాయమాటలు చెప్పి సచివాలయానికి తీసుకెళ్లి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అపస్మారక స్థితికి చేరుకోవడంతో హరిప్రసాద్‌, రాంబాబు అక్కడ నుంచి పరారయ్యారు.

బాలిక ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆమె అక్క చుట్టుపక్కల వెతకగా..సచివాలయం భవంతిలో అపస్మారక స్థితిలో కనిపించిందా బాలిక. చెల్లెల్ని ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లి చూడగా.. దుస్తుల నిండా రక్తం కనిపించింది. బాలిక జననాంగాల నుంచి కూడా రక్తస్త్రావం కావడంతో ఆమె సోదరే నీళ్లతో తుడిచింది. విషయం ఆరా తీయగా వాలంటీర్ ఘాతుకాన్ని అక్కకు చెప్పిందా బాలిక. ఘటన జరిగిన రోజు వారి తల్లిదండ్రులు ఊళ్లో లేకపోవడంతో ఈ విషయం బయటికి రాలేదు. రెండ్రోజుల తర్వాత హైదరాబాద్ నుంచి తిరిగొచ్చిన తల్లిదండ్రులకు పిల్లలిద్దరూ జరిగిన విషయం చెప్పారు. ఆ వెంటనే వారంతా వీరఘట్టం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.


బాధిత కుటుంబం ఫిర్యాదుతో ఈ నెల 4న దిశ డీఎస్పీ వాసుదేవ్‌రెడ్డి, పాలకొండ సీఐ శంకరరావు, ఎస్‌ఐ భాస్కరరావులు సంఘటన జరిగిన సచివాలయాన్ని పరిశీలించారు. బాధిత బాలిక నుంచి వివరాలు సేకరించారు. గ్రామ వాలంటీర్ హరిప్రసాద్‌, సచివాలయ కంప్యూటర్ ఆపరేటర్ రాంబాబులపై పోక్సో చట్టం కిందట కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ భాస్కరరావు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాని చెబుతున్నా.. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.

ఏపీలో వాంటీర్ల దుశ్చర్యలకు సంబంధించి వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నడుకూరు గ్రామంలో జరిగిన తాజా ఉదంతంలో స్ధానిక టీడీపీ నాయకులు శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వైసీపీ హయాంలో మహిళలకు రక్షణ కరువైందని పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ ఆరోపించారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో బాధితులను ఫోన్ లో మాట్లాడించారు జయకృష్ణ. బాధితులకు అండగా ఉంటామని, న్యాయం జరిగేదాకా పోరాడుతామని అచ్చన్న భరోసా ఇచ్చారు.

First published:

Tags: Ap grama sachivalayam, Gram volunteer, Minor girl raped, Srikakulam

ఉత్తమ కథలు