టీవీ సీరియల్ చూసి ఉరేసుకున్న బాలిక..

ప్రతీకాత్మక చిత్రం

ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు తమ బిడ్డ ఉరి వేసుకుని కనిపించడంతో కంగారుపడిపోయారు. వెంటనే బాలికను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలిక చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.

  • Share this:
    టీవీలో వచ్చిన ఓ సూసైడ్ సీన్‌ను చూసి ఓ బాలిక తాను కూడా ఉరి వేసుకుంది. అసలు ఉరి ఎలా వేసుకుంటారో చూద్దామనుకున్న ఆ 11 ఏళ్ల బాలిక ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. బెంగళూరులో ఈ దారుణం జరిగింది. ఆ బాలిక తల్లిదండ్రులు బెంగళూరులోని బాగలకుంట ప్రాంతంలో ఓ చిన్న బండి నడుపుతూ ఉంటారు. బాలిక తన సోదరుడితో కలసి ఆ బండి వద్ద కొద్దిసేపు ఉంది. రాత్రి 8 గంటల సమయంలో ఆకలి వేస్తోందని చెప్పి ఇంటికి వెళ్తానంది. రోజూ వెళ్లినట్టే ఇంటికి వెళ్తుంది కదా అని ఆ తల్లిదండ్రులు కూడా సరేనని చెప్పారు. ఇంటికి వెళ్తూ.. ఆ సమీపంలో ఉన్న ఓ టీ స్టాల్ దగ్గర టీవీ చూసింది. అందులో ఉరి వేసుకుంటున్న సీన్ కనిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకున్న బాలిక ఇంటికి వెళ్లిన తర్వాత బట్టలు తగిలించుకునే హ్యాంగర్‌కు ఉరి వేసుకుంది.

    రాత్రి 10 తర్వాత ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు తమ బిడ్డ ఉరి వేసుకుని కనిపించడంతో కంగారుపడిపోయారు. వెంటనే బాలికను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలిక చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు విచారణ చేయడంతో జరిగిన పరిణామాలు వెలుగులోకి వచ్చాయి.
    First published: