• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MIM LEADER KHALEEL MURDER UNIDENTIFIED PERSONS KILLED MIM LEADER KHALEEL IN HYDERABAD NK

MIM Khaleel Murder: హైదరాబాద్‌లో దారుణం... ఎంఐఎం నేత ఖలీల్ హత్య

MIM Khaleel Murder: హైదరాబాద్‌లో దారుణం... ఎంఐఎం నేత ఖలీల్ హత్య

హైదరాబాద్‌లో దారుణం... ఎంఐఎం నేత ఖలీల్ హత్య

MIM Leader Khaleel Murder: ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అసలు అత్తాపూర్‌లో ఏం జరుగుతోంది? ఖలీల్ హత్యపై ఎంఐఎం నేతలు ఏం అంటున్నారు?

  • Share this:
    Hyderabad News: హైదరాబాద్‌లో మరో రాజకీయ హత్య జరిగింది. రాజేంద్రనగర్... అత్తాపూర్‌లో MIM నేత ఖలీల్‌ను ప్రత్యర్థులు హత్య చేశారు. దుండగులు రాళ్లు, కత్తులతో వెంటపడి.. పరుగులు పెట్టించి, గొడ్డలితో నరికి మరీ చంపారు. హసన్ నగర్... మెయిన్ రోడ్డుపై... ఓ ఫంక్షన్ హాల్ ఎదురుగా జరిగిన ఈ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... మర్డర్ కేసు రాసి... దర్యాప్తు ప్రారంభించారు. ఏసీపీ సంజయ్ కుమార్... హత్య ఎలా జరిగిందో, ఏమైందో తెలుసుకుంటున్నారు. ఫోరెన్సిక్ టీమ్... క్రైమ్ సీన్‌లో ఆధారాలు సేకరిస్తోంది. హత్యకు పాత శత్రుత్వాలే కారణమా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.

    ఇది కూడా చదవండి:World Covid 19: నేడు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ మీటింగ్... వ్యాక్సినేషన్‌పై చర్చ

    ఘటనా స్థలం దగ్గర్లోనీ సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఐతే... హత్య రాత్రి పూట జరగడం వల్ల సీసీ కెమెరాల్లో దృశ్యాలు అంత స్పష్టంగా లేవు. అయినప్పటికీ... కుటుంబ సభ్యులు, పార్టీ నేతలను ఆరా తీయడం ద్వారా... ఎవరు హత్య చేశారో తెలుసుకుంటామంటున్నారు పోలీసులు.
    Published by:Krishna Kumar N
    First published: