ఆర్ఎస్ఎస్ కార్యకర్త కుటుంబం దారుణ హత్య.. అసదుద్దీన్ ట్వీట్..

పశ్చిమ బెంగాల్లోని ముర్షీదాబాద్‌లో భర్త, ఎనిమిది నెలల గర్భంతో ఉన్న భార్య, వారి కుమారుడు రక్తపు మడుగులో కనిపించారు.

news18-telugu
Updated: October 10, 2019, 5:55 PM IST
ఆర్ఎస్ఎస్ కార్యకర్త కుటుంబం దారుణ హత్య.. అసదుద్దీన్ ట్వీట్..
పశ్చిమ బెంగాల్లో హత్యకు గురైన ఆర్ఎస్ఎస్ కార్యకర్త ప్రకాష్ పాల్ కుటుంబం (Image:Twitter)
  • Share this:
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్‌లో ఆర్ఎస్ఎస్ కార్యకర్త కుటుంబం దారుణ హత్యకు గురైంది. భర్త, ఎనిమిది నెలల గర్భంతో ఉన్న భార్య, వారి కుమారుడు రక్తపు మడుగులో కనిపించారు. ఓ పదునైన ఆయుధంతో వారిని హత్య చేశారని పోలీసులు తెలిపారు. చనిపోయిన వారు బంధు ప్రకాష్ పాల్, ఆయన భార్య బ్యూటీ మండల్ పాల్ (ఎనిమిది నెలల గర్భిణి), ఆరేళ్ల కొడుకు అంగన్ బంధు పాల్‌గా పోలీసులు గుర్తించారు. ప్రకాష్ ఓ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. షాహాపూర్‌కు చెందిన ప్రకాష్ కుటుంబం వారి కుమారుడి చదువుల కోసం ముర్షీదాబాద్‌కు మారింది. ఎవరితోనైనా విబేధాలు ఉన్నాయా? అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రకాష్ పాల్ హత్య రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ అధికార ప్రతినిధి శంబిత్ పాత్రా ఆ హత్యకు సంబంధించిన వీడియో, ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రకాష్ పాల్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని తెలిపారు. ఇటీవల మూకదాడుల మీద ప్రధాని మోదీకి లేఖ రాసిన ప్రజాస్వామ్యవాదులు ఈ ఘటన మీద నోరెందుకు ఎత్తలేదని విమర్శించారు. కొన్ని ప్రత్యేక అంశాల మీదే వారు ప్రశ్నిస్తారా? అని నిలదీశారు.

పశ్చిమ బెంగాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్త కుటుంబం దారుణ హత్యపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘ఈ దారుణానికి పాల్పడిన వారికి అతి పెద్ద శిక్ష పడేలా మమతా బెనర్జీ చూడాలి.’ అని ట్వీట్ చేశారు. తాను ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను, చర్యలను వ్యతిరేకించినా.. ఇలాంటి హింసాత్మక దాడులను మాత్రం సహించబోమని అసదుద్దీన్ చెప్పారు.


పశ్చిమ బెంగాల్లో రాజకీయ హింస పెరుగుతోంది. రాజకీయపార్టీలకు చెందిన నేతలను హత్య చేయడం, వారిపై దాడులు చేస్తున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. అందులో అన్ని పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బాధతులుగా మారుతున్నారు.

Video : చంద్రబాబు మూతిపై వాతలు పెట్టాలంటున్న అంబటి

First published: October 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading