• Home
 • »
 • News
 • »
 • crime
 • »
 • MILKMAN BEHEADS CAMEL IN BIZARRE RITUAL TO APPEASE DEITY BOOST MILK PRODUCTION IN RAJASTHAN SK

Camel Beheaded: ఒంటెను చంపి తలను ఇంటి ముందు పాతిపెట్టాడు.. ఎందుకో తెలుసా? షాకింగ్ నిజాలు

(ప్రతీకాత్మక చిత్రం)

రాజస్థాన్‌లో ఒంటెలను బలి ఇవ్వడం ఇది కొత్తేం కాదు. కొన్ని రాజకుటుంబాలతో పాటు సాధారణ ప్రజలు కూడా మూఢనమ్మకాలతో ఎడారి ఓడలను చంపేస్తున్నారు

 • Share this:
  ఒంటె రాజస్థాన్ రాష్ట్ర జంతువు. అలాంటి ఒంటెను ఓ వ్యక్తి అతి కిరాతకంగా హత్యచేశాడు. అదేదో మాంసం కోసం కాదు. మంత్రాలు, మూఢనమ్మకాల మాయలో పడి తలను నరికేశాడు. అనంతరం ఇంటి ముందు గుంత తవ్వి అందులో పూడ్చిపెట్టాడు. రాజస్థాన్‌లోని ప్రముఖ పర్యటక ప్రాంతం ఉదయ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సూరజ్‌పోల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గోవర్ధన్‌ విలాస్‌ ప్రాంతంలో రాజేశ్‌ అహిర్‌ అనే వ్యక్తి పాల డెయిరీ నిర్వహిస్తున్నాడు. అతడి డెయిరీలో దాదాపు 30 ఆవులు ఉన్నాయి. ఐతే కొన్ని రోజులుగా అతడి పాల వ్యాపారం సజావుగా సాగడం లేదు. ఆవులు అనారోగ్యం పాలవడంతో పాలు తక్కువగా ఇస్తున్నాయి. తద్వారా తన వ్యాపారం దెబ్బతింది. తనకు ఎందుకు ఇలా జరుగుతోంది? ఏం చేయాలి? అని ఆలోచించాడు. ఈ క్రమంలోనే సలహా కోసం చేతన్ అనే యువకుడిని కలిశాడు.

  చేతన్ తండ్రి శోభాలాల్ మంత్రతంత్రాలు చేస్తుంటాడు. రాజేష్‌ను తన తండ్రిని వద్దకు తీసుకెళ్లి విషయం చెప్పాడు చేతన్. ఐతే స్థానిక దేవుడు మీ ఫ్యామిలీపై ఆగ్రహంగా ఉన్నాడని.. ఆయన కోపం చల్లారాలంటే ఒంటెను బలి ఇవ్వాలని సూచించాడు శోభాలాల్. కానీ రాజేష్ వద్ద ఒంటెలు లేవు. కొనాలంటే ఎక్కువ ఖర్చవుతుంది. అందుకే కొన్ని రోజులుగా పాటు ఒంటెల కోసం వెతికాడు. ఎట్టకేలకు నగర శివారులో ఓ ఒంటె కనిపించింది. అది ఒంటరిగానే సంచరిస్తుండడంతో దానికి యజమాని ఎవరూ లేరని నిర్దారించుకున్నారు. ఆ ఒంటెను రాజేష్ డైరీ కేంద్రానికి తీసుకెళ్లి మే 23న బలి ఇచ్చారు. శోభాలాల్ ఏవేవో మంత్రాలు చదివి గొడ్డలితో ఒంటె తలను నరికేశాడు. తలను, మొండెంను వేరుచేశారు. మొండెంను ఓ నిర్మానుష్య ప్రాంతంలో విసిరేసి.. తలను మాత్రం రాజేశ్ డైరీ వద్ద పూడ్చిపెట్టారు. మూడు రోజుల తర్వాత తలను బయటకు తీశారు. రాజేష్ ఇంటి ముందు గొయ్యి తీసి అందులలో పూడ్చిపెట్టారు. ఈ తతంగమంతా రాత్రిపూట మాత్రమే చేశారు.

  ఐతే ఇటీవల తల లేని ఒంటె మొండం స్థానికులకు కనిపించడంతో.. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఒంటె తల లేకపోవడం.. కేవలం మొండెం మాత్రమే ఉండడంతో.. ఏదో తేడాగా ఉందని అనుమానించారు. దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే రాజేష్ గురించి తెలిసింది. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు కథ బయటకు వచ్చింది. తన డైరీలోని ఆవులు పాలు ఇవ్వడం లేదని.. అందుకే మంత్రగాడి సూచన మేరకు ఒంటెను బలి ఇచ్చామని వివరించాడు. పోలీసులు అతడి డైరీతో పాటు ఇంటి వద్దకూ వెళ్లి ఆధాలు సేకరించారు. అనంతరం రాజేశ్‌తో పాటు చేతన్, శోభాలాల్, అతడి స్నేహితుడిని అరెస్ట్ చేశారు.

  కాగా, రాజస్థాన్‌లో ఒంటెలను బలి ఇవ్వడం ఇది కొత్తేం కాదు. కొన్ని రాజకుటుంబాలతో పాటు సాధారణ ప్రజలు కూడా మూఢనమ్మకాలతో ఎడారి ఓడలను చంపేస్తున్నారు. కొందరైతే ఏటా పలు పండుగల సమయంలో ఒంటెలను వధించేవారు. ఈ క్రమంలోనే 2014లో ఒంటెను రాష్ట్ర జంతువుగా ప్రకటించింది రాజస్థాన్ ప్రభుత్వం. అనంతరం ఒంటెలను వేటాడటాన్ని, బలివ్వడాన్ని నిషేధిస్తూ 2015లో ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది.
  Published by:Shiva Kumar Addula
  First published: