ఫిబ్రవరి 21న చెన్నైలోని కొలతూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ దారుణం. 22 ఏళ్ల పాలబ్బాయి ఆర్ వేలన్... పాలు పోసేందుకు వచ్చి.. తన దగ్గర నుంచి 3 సవర్ల బంగారు నగలు ఎత్తుకు పోయాడని 52 ఏళ్ల ఓ మహిళ కంప్లైంట్ ఇచ్చింది. కేసు రాసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి ఇంటికి వెళ్లారు. ఎలా బంగారం ఎత్తుకుపోయిందీ ఆమెను వివరాలు అడిగారు. ఆమె కొడుకు, కుటుంబ సభ్యులు కూడా... ఆ పాలబ్బాయిని కఠినంగా శిక్షించాలని కోరారు. పోలీసులు వారికి ధైర్యం చెప్పారు. నగలు రికవరీ అయ్యేలా చేసి... అతనికి శిక్ష పడేలా చేస్తామన్నారు.
ఆ తర్వాత ఆమె ఇంటి నుంచి పోలీసులు బయటకు వెళ్తంటే... ఆ పక్కింట్లో సీసీ టీవీ కెమెరా కనిపించింది. వెంటనే ఆ ఇంటికి వెళ్లిన పోలీసులు... 21 నాటి ఫుటేజ్ చూపించమన్నారు. అందులో పాలబ్బాయి ఆమె ఇంటికి రావడం... కాసేపటి తర్వాత పారిపోతున్నట్లు కనిపించింది. దాంతో నగలు పట్టుకొని పారిపోతున్నాడని పోలీసులు అనుకున్నారు.
పాలబ్బాయి మొబైల్ నంబర్ ట్రాక్ చేసి... అతన్ని కనిపెట్టిన పోలీసులు... ఆ నగలెక్కడ దాచావ్... ఎవరికి అమ్మావ్ అని చితకబాదుతుంటే... లబోదిబో మన్నాడు. తాను నగలు చోరీ చెయ్యలేదనీ... ఆమెను రేప్ చెయ్యడానికి యత్నించానని చెప్పాడు. ఆమె గట్టిగా అరుస్తుంటే... అక్కడి నుంచి పారిపోయాననీ... తాను రేప్ చెయ్యలేదనీ... చోరీ కూడా చెయ్యలేదని చెప్పాడు. బాధితురాలు చెప్పిన దానికి పూర్తి విరుద్ధమైన యాంగిల్... నిందితుడు చెప్పడంతో... పోలీసులు మరోసారి ఆమె ఇంటికి వెళ్లి ఇదే విషయమై ప్రశ్నించారు.
అప్పుడు అసలు విషయం చెప్పింది. తనపై దారుణానికి పాల్పడిన వాడికి ఎలాగైనా శిక్ష పడాలని అనుకున్న ఆమె... లైంగిక వేధింపుల విషయం చెబితే... నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారేమోననే భయంతో... ఇలా బంగారం నగలు చోరీ చేసినట్లు కుటుంబ సభ్యులకు చెప్పానంది. అసలు విషయం తెలుసుకున్న పోలీసులు... చోరీ కేసును... లైంగిక వేధింపుల కేసుగా మార్చారు. నిందితుడు వేలన్పై ఆయా సెక్షన్లను బనాయించి... జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు.
ఈ కేసుపై పోలీసులు మీడియాకు కొంత వివరణ ఇచ్చారు. నిందితుడు వేలన్... పాల ప్యాకెట్లు డెలివరీ చేస్తాడనీ... ఘటన జరిగిన రోజు... తెల్లవారు జామున... ఇంకా పూర్తిగా వెలుతురు రాని సమయంలో... వేలన్... బాధితురాలి ఇంటికి వెళ్లాడు. పాల ప్యాకెట్లు ఇస్తున్నట్లే ఇస్తే... ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. దాంతో ఆమె అరవడం మొదలుపెట్టింది. ఆమె నోరు నొక్కేద్దామని యత్నించాడు. ఆమె గట్టిగా ఎదుర్కొంది. దాంతో... ఇంట్లో మిగతా సభ్యులు లేస్తే... తన పని అయిపోతుందనుకున్న వేలన్... అక్కడి నుంచి పారిపోయాడు. అందుకే అలర్ట్ గా ఉండాలని కోరుతున్నారు చెన్నై పోలీసులు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.