మరో మహిళతో సంబంధం కోసం... భార్యను దారుణంగా చంపిన జవాన్...

విధి నిర్వహణకు భార్యకు దూరమైన జవాన్... ఉద్యోగం చేసే ప్రదేశంలో మరో మహిళతో పరిచయం... వివాహేతర సంబంధం విషయం తెలిసి, భర్తను నిలదీసిన భార్య...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 10, 2019, 4:52 PM IST
మరో మహిళతో సంబంధం కోసం... భార్యను దారుణంగా చంపిన జవాన్...
మరో మహిళతో సంబంధం కోసం... భార్యను దారుణంగా చంపిన జవాన్...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 10, 2019, 4:52 PM IST
అతనో జవాన్. సరిహద్దులో దేశ రక్షణ కోసం ఆయుధం పట్టుకుని కాపలా కాయాల్సిన అతను... కట్టుకున్న భార్యను కడతేర్చాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భార్యను అతిదారుణంగా హత్య చేశాడు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన... తమిళనాడు రాష్ట్రంలో వెలుగుచూసింది. తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లా గురుపరపల్లి ఏరియాకి దగ్గర్లో ఉన్న దిప్పనపల్లికి చెందిన 31 ఏళ్ల రాజేశ్... రాజస్థాన్ రాష్ట్రంలోని జోద్‌పూర్ ఏరియాలో సైనికుడిగా పనిచేస్తున్నాడు. గౌతమి అనే 29 ఏళ్ల మహిళతో రాజేశ్‌కు 2012లో వివాహమైంది. వీరికి ఓ కొడుకు, కూతురు కూడా ఉన్నారు. అయితే విధి నిర్వహణలో ఉన్న సమయంలో 30 ఏళ్ల కలైవాణి అనే యువతితో రాజేశ్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్తకు విడాకులు ఇచ్చి, ఒంటరిగా ఉంటున్న కలైవాణి, రాజేశ్‌తో శారీరక సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. అయితే వీరి సంబంధానికి రాజేశ్ భార్య గౌతమి అడ్డంకిగా మారింది.

కలైవాణితో వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న గౌతమి... అతన్ని నిలదీసింది. తాను కూడా మరో మగాడితో సంబంధం పెట్టుకుంటే... ఏం చేస్తావని నిలదీసింది. దాంతో కలైవాణికి కొన్నిరోజులుగా దూరంగా ఉంటూ వస్తున్నాడు రాజేశ్. ప్రియుడి పరిస్థితిని అర్థం చేసుకున్న కలైవాణి, భార్యను చంపేస్తే మనం హాయిగా ఎంజాయ్ చేయవచ్చని సలహా ఇచ్చింది. కలైవాణి సలహా నచ్చిన అతను... భార్యను చంపేందుకు పథకం పన్నాడు. సెలవులకి ఇంటికి వెళ్లి, ఆమెతో రెండు రోజులుగా హాయిగా గడిపాడు. తర్వాత ఏప్రిల్ 5న రాత్రి నిద్రపోతున్న సమయంలో గౌతమి ముఖంపై దిండుతో నొక్కి, ఊపిరాడనివ్వకుండా చేసి హత్య చేశాడు. ఉదయం ఏమీ తెలియనట్టుగా భార్య గుండెపోటుతో చనిపోయిందని చెప్పాడు. అయితే గౌతమి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
First published: April 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...