Home /News /crime /

MIGRANT KASHMIRI PANDIT TEACHER SHOT DEAD BY TERRORISTS IN KULGAM PVN

Jammu and Kashmir : కశ్మీరీ పండిట్ టీచర్ ని కాల్చి చంపిన ఉగ్రవాదులు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Teacher shot dead by terrorists: జమ్మూకశ్మీర్‌(Jammu Kashmirలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కుల్గాంలోని గోపాల్​పురలో ఓ కశ్మీరీ పండిట్ టీచర్​పై ముష్కరులు కాల్పులుకు తెగబెడ్డారు.

Teacher shot dead by terrorists: జమ్మూకశ్మీర్‌(Jammu Kashmirలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కుల్గాంలోని గోపాల్​పురలో ఓ కశ్మీరీ పండిట్ టీచర్​పై ముష్కరులు కాల్పులుకు తెగబెడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు, పోలీసుల బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ను ప్రారంభించాయి.

మృతురాలిని రజనీ భల్లాగా గుర్తించారు. రజనీ జమ్మూ డివిజన్‌లోని సాంబా జిల్లా నివాసి. కాల్పులకు తెగబడ్డ వారిని త్వరలోనే గుర్తించి,మట్టుబెడుతామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. గత వారం టీవీ నటిపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా.. తీవ్ర గాయాలతో మృతి చెందింది. అంతకు ముందు వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారే లక్ష్యంగా ముష్కరులు కాల్పులు జరిపారు.

ALSO READ Shocking: మూడో భార్య,అత్తమామలను కాల్చి చంపిన భర్త

జమ్ముకశ్మీర్‌(Jammu and Kashmir)లో ఉగ్రవాదులు ఏరివేత కొనసాగుతోంది. దక్షిణ కశ్మీర్ లోని పుల్వామా(Pulwama)జిల్లాలోని గండిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు అనుమానిత జైష్-ఎ-మహ్మద్ (JeM) ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందడంతో ఆదివారం రాత్రి భద్రతా బలగాలు, స్థానిక పోలీసుల సంయుక్త బృందం కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించాయి.. ఈ సందర్భంగా ఎదురుకాల్పులు జరిగాయని, ఈ క్రమంలో వారిని కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి ఓ ఉగ్రవాది హతమయ్యాడు. సోమవారం ఉదయం మరో ఉగ్రవాదిని మట్టుబెట్టినట్లు ఐజీపీ పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రెండు ఏకే రైఫిల్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రియాజ్‌ అనే పోలీస్‌ను కాల్చి చంపిన ఘటనలో ఈ ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొన్నట్లుగా తెలిపారు
Published by:Venkaiah Naidu
First published:

Tags: Jammu and Kashmir, Terrorists

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు