హోమ్ /వార్తలు /క్రైమ్ /

వరంగల్‌లో విషాదం.. బావిలో దూకి వలస కూలీ కుటుంబం ఆత్మహత్య

వరంగల్‌లో విషాదం.. బావిలో దూకి వలస కూలీ కుటుంబం ఆత్మహత్య

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

లాక్‌డౌన్ వల్ల పనులు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారని.. సొంతూరికి కూడా వెళ్లలేని పరిస్థితిలో.. ఆత్మహత్య చేసుకొని ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.

వరంగల్ రూరల్ జిల్లా విషాదం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కూలీ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు బావిలో దూకి చనిపోయారు. గీసుకొండ మండల గొర్రెకుంటలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం 20 ఏళ్ల క్రితం వరంగల్‌కు వలస వచ్చింది. స్థానికంగా ఓ పప్పు మిల్లులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఐతే గురువారం దంపతులతో పాటు వారి ఇద్దరు పిల్లలు గొర్రెకుంట ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ బావిలో శవాలై కనిపించారు. లాక్‌డౌన్ వల్ల పనులు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారని.. సొంతూరికి కూడా వెళ్లలేని పరిస్థితిలో.. ఆత్మహత్య చేసుకొని ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Crime news, Lockdown, Telangana, Warangal

ఉత్తమ కథలు