మనుషులు కాదు వీళ్లు మానవ మృగాలు.. పీకల దాకా మద్యం సేవించారు.. అదే సమయంలో అభశుభం తెలియన ఒక ఒంటరి మహిళ వారి కంట పడడమే పాపమైంది. మనుషులం అన్న సంగతి మరిచిపోయారు. కామంతో కళ్లుమూసుకుపోయిన 15 మంది కీచకలు ఆమెను చెరబట్టే ప్రయత్నం చేశారు. ఆమె కేకలు వేయడంతో బీరు సీసాలతో దాడి చేశారు. 15 మందిలో ఒక్కరికి కూడా జాలి కలగలేదు. అయ్యో పాపం ఒంటరి మహిళ అని కరుణ చూపించలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పెనుబాక గ్రామంలో ఈ దారుణం జరిగింది. అది కూడా పుట్టిన రోజు వేడుకులకు అని వెళ్లిన యువకులు ఈ దారుణానికి పాల్పడ్డారు. పాపం అది కూడా ఓ మతిస్థిమితం లేని మహిళపై దాడి చేసి కీచకుల్లా మారారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియకుండా ప్రవర్తించారు. ప్రస్తుతం ఆ మహిళ ప్రభుత్వాస్పత్రికి చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గ్రామానికి చెందిన ఓ యువకుడి పుట్టిన రోజు వేడుకలు గ్రామ సమీపంలోని పొలాల్లో చేసుకున్నారు. ఈ కార్యక్రామానికి 15మంది యువకులు హాజరయ్యారు. ఆ పార్టీలో భాగంగా పీకల దాకా మద్యం తాగారు. నైట్ కర్ఫ్యూ ఆంక్షలు.. కరోనా భయం ఏమీ లేకుండా హల్ చల్ చేశారు. అక్కడితో ఆగకుండా ఆ మద్యం మత్తులో మానవ మృగాలుగా ప్రవర్తించారు. అదే సమయానికి అక్కడ బస్ షెల్టర్లో తలదాచుకుంటున్న, మతిస్థిమితం లేని మహిళపై వారి కన్ను పడింది. వెంటనే అఘాయిత్యానికి యత్నించారు. ప్రతిఘటించిన మహిళపై యువకులు దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలి బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: ప్లీజ్ అర్జెంట్ కాల్ మాట్లాడి ఇస్తాను అంటూ అమ్మాయిని ఫోన్ అడిగాడు.. చివరికి ఏమైందంటే..?
అయితే ఈ ఘటనలో నిందితులు అందరూ అధికారపార్టీ మద్దతుదారులు కావడంతో స్థానిక నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. దీంతో అసలు వ్యక్తులను వదిలి వారి స్థానంలో వేరే వ్యక్తులను నిందితులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: పోలీస్ వాట్సప్ గ్రూపుల్లో డాన్ కూతురి నెంబర్.. ఎలా వచ్చింది..? ఏం జరిగింది..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.