Home /News /crime /

MIDNIGHT DRONES FLYING AT SRISIALAM TEMPLE POLICE AND LOCAL SECURITY TRYING TO CATCH BUT NOT POSSIBLE NGS

SriSailam: శ్రీశైలం పుణ్య క్షేత్రంలో అర్ధరాత్రి డ్రోన్ల అలజడి.. డ్రోన్ల వెనుక ఉన్నది ఎవరు..?

ప్రతికాత్మక చిత్రం

ప్రతికాత్మక చిత్రం

ఏపీలో ఏం జరుగుతోంది.. ప్రముఖ పుణ్య క్షేత్రాలు ఎంత వరకు భద్రంగా ఉన్నాయి.. తాజాగా శ్రీశైలం పుణ్యక్షేత్రంపై అర్థరాత్రి డ్రోన్ లు ఎగరడం కలకలం రేపుతోంది. ఎన్ని విశ్వ ప్రయాత్నాలు చేసినా భద్రతా సిబ్బంది వాటి ఆచూకీ తెలుసుకోలేకపోయారు. ఇంతకీ ఆ డ్రోన్లు ఎగురవేసింది ఎవరు...?

ఇంకా చదవండి ...
    ఇటీవల కాలంలో డ్రోన్ ల కలవరం పెరుగుతోంది. అది కూడా అర్థరాత్రి డోన్లు దర్శనమివ్వడంతో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు.  మొన్నటికి మొన్న కశ్మీర్‌లోని ఎయిర్‌ఫోర్స్ లో డ్రోన్ కనిపించింది మొదలు దేశవ్యాప్తంగా డ్రోన్ల అలజడి ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ను సైతం డ్రోన్ ల భయం వీడడం లేదు. తాజాగా శ్రీశైలం పుణ్యక్షేత్రంలోనూ డ్రోన్ కనిపించడం కలకలం రేపింది. అర్ధరాత్రి ఆలయ పరిసరాల్లోని ఆకాశంలో అనుమానస్పదంగా డ్రోన్ కెమెరాలు చక్కర్లు కొట్టినట్లు తెలుస్తోంది. వాటిని పట్టుకునేందుకు పోలీసులు, దేవస్థానం సిబ్బంది అటవీశాఖ సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేశారు. చాలా సేపటి వరకు వాటిని పట్టుకునే ప్రతయ్నం చేశారు. కానీ వాటి ఆచూకీ మాత్రం దొరకలేదు. అయితే ఇలా డ్రోన్ లు రావడం మొదటి రోజు కాదని.. గత నాలుగు రోజులుగా రాత్రుళ్లు ఎగురుతూనే ఉన్నాయని స్థానికులు అంటున్నారు. దీంతో ఏదో జరుగుతోందనే భయంవెంటాడుతోంది..

    ఇటీవల జమ్ము కశ్మీర్ లోని ఎయిర్ ఫోర్స్ పరిధిలో డ్రోన్లు ఎగరడంతో ఉగ్రవాద దాడిగా అనుమానించింది ఎన్ఐఏ. దీనిపై ప్రధాని సైతం వెంటనే అలర్ట్ అయ్యారు. ఉన్నతాధికారులతో సమీక్షలు చేశారు. ఇది ఉగ్రవాదుల చర్యగా అనుమానిస్తున్నారు. అయితే ఇప్పుడు శ్రీశైలం ఏం జరుగుతుందో అని అనుమానిస్తున్నారు స్థానికులు.

    ఇదీ చదవండి: బీజేపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి ఆ కీలక నేత.. రివర్స్ అవుతున్న కమలం ప్లాన్

    ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అర్థరాత్రి డ్రోన్లు ఎవరు ఎగరి వేసి ఉంటారు అన్నది అంతు చిక్కడం లేదు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాల్లో ఆకాశంలో అనుమానాస్పదంగా డ్రోన్‌ కెమెరాలు చక్కర్లు కొట్టడంపై విచారణ జరుపుతున్నామని పోలీసులు చెబుతున్నారు. గత కొంతకాలంగా భారత్‌-పాకిస్థాన్‌ బోడర్‌లో డ్రోన్లు కలకలం సృష్టిస్తుండగా.. కొన్నింటిని సైన్యం పేల్చివేసింది.. తాజాగా, జమ్మూ ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్లతో దాడికి పాల్పడడం, ఆ తర్వాత పాకిస్థాన్‌లోని భారత ఎంబసీ పరిసరాల్లో డ్రోన్లు ఆకాశంలోకి ఎగరడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇదే, సమయంలో.. శ్రీశైలంలో అనుమానాస్పద డ్రోన్లు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదీ కూడా అందులో భాగంగానే జరిగిందా..? దీని వెనుక కుట్ర కోణం ఏదైనా ఉందా అనే భయం పెరుగుతోంది. స్థానికులు మాత్రం త్వరగా ఈ మిస్టరీని చేధించాలని పోలీసులను కోరుతున్నారు. గత నాలుగు రోజులుగా డ్రోన్లు ఎగురుతుండడంతో.. అర్థరాత్రి పూట సైతం ఇప్పుడు నిఘా పెంచారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Drone attack, Kurnool, Srisailam, Srisailam Temple

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు