MICROSOFT WARNS ABOUT ANDROID MALWARE THAT COULD SECRETLY STEAL YOUR MONEY GH SK
Android Malware: వీటితో జాగ్రత్త.. లేదంటే మీ డబ్బు మాయం.. ఆండ్రాయిడ్ యూజర్లకు మైక్రోసాఫ్ట్ వార్నింగ్
ప్రతీకాత్మక చిత్రం
Android Malware: ఒక మాల్వేర్ గురించి ఆండ్రాయిడ్ యూజర్లను హెచ్చరించింది మైక్రోసాఫ్ట్. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పాత వెర్షన్లను ఇప్పటికీ ఉపయోగిస్తున్న వినియోగదారులు అలర్ట్‌గా ఉండాలని తెలిపింది. వారికి తెలియకుండానే వాలెట్‌ను ఖాళీ చేసే మాల్వేర్ గురించి హెచ్చరించింది.
Android Malware: ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (Android OS) హై రేంజ్ సెక్యూరిటీకి ప్రాధాన్యం ఇస్తుంది. అయితే ఈ ఓఎస్‌లోని కొన్ని బగ్స్.. సైబర్ నేరగాళ్లకు అస్త్రాలుగా మారుతాయి. వీటి ద్వారా యూజర్ల డివైజ్‌లోకి మాల్వేర్ పంపించి, వారి అకౌంట్లలో డబ్బు దొంగిలిస్తుంటారు సైబర్ నేరగాళ్లు. తాజాగా ఇలాంటి మాల్వేర్ గురించి ఆండ్రాయిడ్ యూజర్లను హెచ్చరించింది మైక్రోసాఫ్ట్ (Microsoft). ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పాత వెర్షన్లను ఇప్పటికీ ఉపయోగిస్తున్న వినియోగదారులు అలర్ట్‌గా ఉండాలని తెలిపింది. వారికి తెలియకుండానే వాలెట్‌ను ఖాళీ చేసే మాల్వేర్ (Malware) గురించి హెచ్చరించింది.
మైక్రోసాఫ్ట్ 365 డిఫెండర్ టీమ్ ఈ టోల్ ఫ్రాడ్ మాల్వేర్ గురించి కొన్ని వివరాలను వెల్లడించింది. ఇది ఒక రకమైన బిల్లింగ్ ఫ్రాడ్. యూజర్ల అనుమతి, అవసరం లేకుండా ప్రీమియం సర్వీస్ సబ్స్క్రిప్షన్ కోసం ఇది సైన్ అప్ చేయగలదు. ఇలాంటి బిల్లింగ్ మోసంతో యూజర్ల డబ్బును సైబర్ నేరగాళ్లు కాజేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ బృందం తెలిపింది. ఇది అత్యంత ప్రమాదకరమైన మాల్వేర్ అని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇది నిరంతరం అభివృద్ధి చెందుతుంది. ఆండ్రాయిడ్ యూజర్లపై దాడి చేసేందుకు టోల్ ఫ్రాడ్ మాల్వేర్ వైర్లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్ (WAP) అనే బిల్లింగ్ మెకానిజమ్‌ను దుర్వినియోగం చేస్తుందని ఈ బృందం తెలిపింది. మొబైల్ ఫోన్ బిల్లు ద్వారా పెయిడ్ కంటెంట్ కోసం ఛార్జ్ చేయడానికి చట్టబద్ధమైన యాప్‌లు WAPని ఉపయోగిస్తాయి.
ఈ టోల్ ఫ్రాడ్ మాల్వేర్ యూజర్లకు తెలియకుండానే ప్రీమియం సర్వీస్‌లకు ఆటోమేటిక్‌గా రిజిస్టర్ చేస్తుంది. ఇది పని చేయడానికి సెల్యులార్ నెట్‌వర్క్‌లపై ఆధారపడుతుంది. కాబట్టి Wi-Fi నెట్వర్క్ నుంచి డిస్కనెక్ట్ అయిన తర్వాత దాడిని ప్రారంభిస్తుంది. మీరు మొబైల్ నెట్వర్క్కి కనెక్ట్ అయినప్పుడు, ఈ మాల్వేర్ సబ్స్క్రిప్షన్ పేజీని ఓపెన్ చేస్తుంది, మీ తరఫున ప్రీమియం సర్వీస్ మెంబర్షిప్ పొందుతుంది. ఇది OTP (వన్-టైమ్ పాస్వర్డ్) వంటి వాటిని కూడా రీడ్ చేయగలదు, సబ్స్క్రిప్షన్ ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన అన్ని ఫీల్డ్‌లను నింపగలదు. అయితే స్కామర్లు యూజర్ల ఫోన్లకు SMS నోటిఫికేషన్లను నిలిపివేయడం ద్వారా ఈ విషయాలను దాచగలరు.
ఈ మాల్వేర్ అనేక రిస్క్‌లకు కారణమవుతుంది. వాటిలో ప్రధానమైనది.. యూజర్ల నెలవారీ ఫోన్ బిల్లు ఛార్జీలు భారీగా పెరుగుతాయి. ఈ మాల్వేర్ను గుర్తించనలేని విధంగా రూపొందించారు. టోల్ ఫ్రాడ్ మాల్వేర్ యాప్‌ల బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుందని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. ఈ మాల్వేర్ ఆండ్రాయిడ్ 9, దానికి ముందు తరం పాత వెర్షన్లతో నడుస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్లను టార్గెట్ చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఆండ్రాయిడ్ 10 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ ఓఎస్ ఉండే ఫోన్లను వాడుతున్న యూజర్లకు దీనితో ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే అదనపు రక్షణ కోసం యాంటీవైరస్ యాప్‌లను ఉపయోగించడం మంచిది. థర్డ్ పార్టీ సోర్సెస్ నుంచి యాప్‌లను ఇన్స్టాల్ చేయవద్దని మైక్రోసాఫ్ట్ హెచ్చరిస్తోంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.