హోమ్ /వార్తలు /క్రైమ్ /

Andhra Pradesh: కాల్ మనీ యాప్స్ దురాగతాలు... పోలీస్టేషన్లకు క్యూ కడుతున్న బాధితులు

Andhra Pradesh: కాల్ మనీ యాప్స్ దురాగతాలు... పోలీస్టేషన్లకు క్యూ కడుతున్న బాధితులు

అలాంటి వాటిని నమ్మి.. వారికి ఈ వివరాలు చెబితే బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చని పోలీసులు హెచ్చరించారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అలాంటి వాటిని నమ్మి.. వారికి ఈ వివరాలు చెబితే బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చని పోలీసులు హెచ్చరించారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మైక్రో ఫైనాన్స్ యాప్ నిర్వాహకుల వేధింపులు పెరిగిపోతున్నాయి. కాల్ మనీ గాళ్ల వేధింపులు భరించలేక బాధితులు పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో మైక్రో ఫైనాన్స్ యాప్ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. వాళ్లు పెట్టే టార్చర్ భరించలేక పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా విజయవాడలో కాల్ మనీ యాప్ బాధితులు వందల్లో ఉన్నారు. ఒక్కరోజులోనే 20 మంది బాధితులు తమను రక్షించాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు. వేలల్లో అప్పులిచ్చి లక్షలో దండుకుంటున్నారని వాపోతున్నారు. పెనమలూరు, కృష్ణలంక, భవానీపురం, సత్యనారాయణపురం, పటమట పోలీస్ స్టేషన్లలో ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు అప్పు తీసుకున్నవారిని వేధింపులకు గురిచేయొద్దంటూ వార్నింగ్ ఈ-మెయిల్స్ పంపారు. బాధితుల్లో విద్యార్థులు, ప్రైవేట్ జాబ్స్ చేస్తున్న వారే అధికంగా ఉన్నారు. మరోవైపు ప్రజల్ని వేధిస్తున్న మైక్రో ఫైనాన్స్ యాప్ లపై దృష్టి పెట్టిన ప్రభుత్వం గూగుల్ ప్లే స్టోర్ లో 52 యాప్ లను సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.

జీవితాలు బుగ్గి

రాజధాని ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఇటీవల 12 యాప్ ల ద్వారా దాదాపు లక్షన్నర వరకు తీసుకున్నాడు. తొలుత 5వేలతో మొదలైన అప్పు.. ఆ తర్వాత లక్ష దాటింది. దీంతో అప్పులు తీర్చలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు కలగజేసుకొని తమకు వారసత్వంగా వచ్చిన ఇంటిస్థలాన్ని విక్రయించి ఈ ఊబినుంచి బయటపడ్డారు. తీసుకున్న అప్పుకి వడ్డీ చక్రవడ్డీ కలిపి రూ.8లక్షలు వరకు చెల్లించినట్లు బాధితుడు వాపోయాడు.

ఆన్ లైన్ వల

ఆన్‌లైన్‌లో ఎక్కువసేపు గడిపే వారికి ఆయా యాప్స్‌ లింక్ పంపుతారు. మీకు లోన్ అప్రూవ్ అయిందని లింక్ క్లిక్ చేయాలని ఫోన్ కు మెసేజ్ పెడతారు. చిన్న చిన్న అవసరాలకు మీ దగ్గర డబ్బుల్లేవా..? ఐతే తక్కువ వడ్డీకి మేం అప్పిస్తాం.. షూరిటీ అస్సలు అవసరమే లేదు. అంటూ బుట్టలో వేస్తారు. లింక్ ఓపెన్ చేసి తర్వాత గూగుల్ ప్లే స్టోర్లో యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని చెప్తారు. వాటిని ఓపెన్‌ చేయగానే ఫొటో, ఆధార్‌ కార్డుతోపాటు సెల్‌ఫోన్‌లో గూగుల్‌ డ్రైవ్‌కు సింక్‌ అయిన కాంటాక్టు నంబర్లు తమకు పంపిస్తే చేస్తే వెంటనే రూ.3 వేలు నుంచి రూ.50 వేలు వరకూ అప్పు ఇస్తామంటారు. అప్పులో 10శాతం ప్రాసెసింగ్‌ చార్జీల కింద కట్ చేసి మిగిలిన ఎమౌంట్ గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం ద్వారా పంపిస్తారు. రుణం తీర్చేందుకు 15 నుంచి 20 రోజులు మాత్రమే టైమ్ ఇస్తారు. సకాలంలో చెల్లించకుంటే వడ్డీ మీద వడ్డీ, చక్రవడ్డీ, లేట్ పేమెంట్ ఛార్జీలు.. ఇలా తీసుకున్న అప్పు గోరంత అయితే.. వడ్డీ కొండంత పెరుగుతుంది. డెడ్ లైన్ దాటిన తర్వాత వేధింపుల పర్వం మొదలవుతుంది. అప్పు తీర్చనివాడివి ఎందుకు తీసుకున్నావ్., నీకు బ్రతికే అర్హత ఉందా అంటూ నీచంగా మాట్లాడతారు. ఈ మధ్య మరంత రెచ్చిపోతున్న ఈ కాల్ మనీగాళ్లు బాధితుల బంధువులు, ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి బూతులు తిడుతున్న ఘటనలకు కూడా వెలుగులోకి వచ్చాయి. ‘స్మాల్‌ వ్యాలెట్‌’, ‘బబుల్‌ లోన్‌’ ‘గో క్యాష్‌’, ‘బిలియన్‌ క్యాష్‌’ లోన్‌ బజార్‌ వంటి పేర్లతో వందలాది యాప్‌లను రూపొందించి గూగుల్‌ ప్లే స్టోర్‌లో వదులుతున్నారు. ఇలాంటి యాప్ లు ఒకటికాదు రెండుకాదు దాదాపు 200 వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

లక్ డౌన్ కష్టాలతోనే..

కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో పేద, మధ్య తరగతి వాళ్లే ఎక్కువగా ఉన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో చిన్నచిన్న అవసరాల కోసం యాప్ ల ద్వారా అప్పులు తీసుకోని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఈ యాప్ లోన్స్ మాఫియా టార్గెట్ కూడా మధ్యతరగతి ప్రజలే. బెదిరింపులకు భయపడి ఎక్కువ వడ్డీలు చెల్లిస్తారన్నది వారి లెక్క. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలో చాలా చోటు చేసుకుంటున్నాయి. కొందరు తమకున్న చిన్నపాటి ఆస్తులు, ఇళ్లను అమ్మి మరీ ఆన్ లైన్ అప్పులకు వడ్డీలు కట్టి బయటపడుతున్నారు. అలా తీర్చలేని వారు ప్రాణాలు తీసుకుంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Bank loans, CYBER CRIME, FAKE APPS, Vijayawada

ఉత్తమ కథలు