లైంగిక వేధింపుల కేసులో నానా పటేకర్‌కు క్లీన్‌చిట్ ఇవ్వలేదు

#MeToo | 2009లో ఓ సినిమా సెట్స్‌లో బాలీవుడ్ హీరో నానా పటేకర్ తనను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు గత యేడాది బాలీవుడ్ నటి తనుశ్రీ దత్త సంచలన ఆరోపణలు చేశారు.

news18-telugu
Updated: May 17, 2019, 12:00 PM IST
లైంగిక వేధింపుల కేసులో నానా పటేకర్‌కు క్లీన్‌చిట్ ఇవ్వలేదు
తను శ్రీ దత్త, నానా పటేకర్
  • Share this:
కొన్నేళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్ సెట్స్‌లో బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు నటి తనుశ్రీ దత్తా గత ఏడాది సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. తనుశ్రీ దత్త  ‘మీటూ’ ఆరోపణలపై ముంబై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. తనుశ్రీ దత్తపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు ఎవరూ నిర్ధారించకపోవడంతో...నానా పటేకర్‌కు ముంబై పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చినట్లు గురువారం బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ కథనాలపై తనుశ్రీ దత్త తీవ్రంగా స్పందించారు. ముంబై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, నానా పటేకర్‌కు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారన్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. నానా పటేకర్‌కు క్లీన్ చిట్ ఇస్తూ ముంబై పోలీసులు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదని తనుశ్రీ దత్త ఓ ప్రకటనలో స్పష్టంచేశారు.

nana patekar, tanushree dutta, sexual harassment, me too movement, mumbai police, clean chit for nana patekar, bollywood news, నానా పటేకర్, తనుశ్రీ దత్త, మీటూ ఉద్యమం, ముంబై పోలీసులు
తనుశ్రీ దత్త


నానా పటేకర్‌కు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చినట్లు ఆయన పబ్లిక్ రిలేషన్స్ టీమ్ మీడియాకు అవాస్తవ సమాచారం ఇస్తోందని ఆరోపించారు. లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన నానా పటేకర్‌కు సినీ పరిశ్రమలో ఆఫర్లు దక్కడం లేదన్నారు.  దీంతో నష్టాన్ని భర్తీ చేసుకుని ఇమేజ్ పెంచుకునేందుకు ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని తనుశ్రీ దత్త చెప్పారు.Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి

Found a li'l spot to meditate!! My favourite activity that helps me ignore the stupid comments of stupid people on my insta.I mean seriously you guys, ppl should give a long hard look at themselves in the mirror before commenting on other peoples lives and looks.Go get a life loserly trollers coz I have a really good one!! Jealous of me and so picking on me..not working..I shrug it all away in 5 mins of meditation!! Where as you burn in your negativity your whole life!! Learn from me if u can..if not il just block you😏😏😏


Tanushree Dutta (@iamtanushreeduttaofficial) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది
Published by: Janardhan V
First published: May 17, 2019, 12:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading