సహోద్యోగి డ్రెస్ మార్చుకుంటుండగా వీడియో తీసిన స్టేషన్ మాస్టర్...

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం రైల్వేస్టేషన్‌‌లో దారుణం... పవర్ బాక్సులో వీడియో కెమెరా పెట్టి, గేట్ ఉమెన్ బట్టలు మార్చుకుంటుండగా రికార్డు చేసిన స్టేషన్ మాస్టర్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 15, 2018, 3:09 PM IST
సహోద్యోగి డ్రెస్ మార్చుకుంటుండగా వీడియో తీసిన స్టేషన్ మాస్టర్...
నమూనా చిత్రం
  • Share this:
పనిచేసే భద్రతాపూర్వకమైన వాతావరణం ఏర్పాటుచేయాలనే ఉద్దేశ్యంతో ‘మీటూ’ మూమెంట్ ఓ వైపు దేశాన్ని అతలాకుతలం చేసేస్తుంటే, మరోవైపు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. తాజాగా సహోద్యోగి దుస్తులు మార్చుకుంటుండగా సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన రైల్వేస్టేషన్ మాస్టర్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం రైల్వేస్టేషన్‌‌లో వెలుగుచూసిందీ దారుణ సంఘటన. రైల్వేస్టేషన్‌లో గేట్ ఉమెన్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ... ప్రతీరోజూ స్టేషన్ మాస్టర్ గది పక్కనే ఉండే మరో గదిలో యూనిఫారం మార్చుకుంటోంది. ఈ విషయం తెలిసిన స్టేషన్ మాస్టర్ మహ్మద్ రియాద్ ఆ గదిలోని పవర్ బాక్సులో రహస్యంగా వీడియో కెమెరాను అమర్చాడు.

ఈ విషయం గమనించని సదరు మహిళ, రోజూలానే తన దినచర్యను కొనసాగించింది. ఇలా కొన్నిరోజులుగా అర్థనగ్న దృశ్యాలను వీడియో కెమెరాలో రికార్డు చేసిన స్టేషన్ మాస్టర్ వాటిని ల్యాప్‌ట్యాప్‌లో భద్రపర్చుకుని, చూస్తూ ఆనందించేవాడు. రోజూ ఆమె వస్తుంటే అదోలా చూసే రియాద్ చూపులను బట్టి ఆమె అనుమానం కలిగింది. దీంతో రూమ్ మొత్తం వెతికి చూసిన ఆమె, పవర్ బాక్స్ తెరిచి చూసి షాక్ అయ్యింది. లోపల వీడియో కెమెరా కనిపించడంతో వెంటనే స్టేషన్ ఉన్నతాధికారులకు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ల్యాప్‌ట్యాప్‌ను, వీడియో కెమెరాను సీజ్ చేసిన పోలీసులు, రియాద్‌పై కేసు నమోదు చేశారు. దీంతో స్టేషన్ మాస్టర్ మహ్మద్ రియాద్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు డీఆర్ఎం నోటీసులు పంపారు.First published: November 15, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>