బంగారాన్ని పేస్ట్‌లా చేసి... షూ సాక్స్‌లో దాచి... ఫలించని స్మగ్లర్ల ఎత్తుగడ

Gold Smuggling : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్... దొంగా పోలీస్ గేమ్ రోజూ కామనైపోతోంది. రకరకాలగా ఎత్తుగడలు వేస్తున్న స్మగ్లర్ల ఆటలు అక్కడ సాగట్లేదు.

news18-telugu
Updated: February 28, 2020, 2:01 PM IST
బంగారాన్ని పేస్ట్‌లా చేసి... షూ సాక్స్‌లో దాచి... ఫలించని స్మగ్లర్ల ఎత్తుగడ
బంగారాన్ని పేస్ట్‌లా చేసి... షూ సాక్స్‌లో దాచి... ఫలించని స్మగ్లర్ల ఎత్తుగడ
  • Share this:
Gold Smuggling : దుబాయ్, గల్ఫ్ దేశాల నుంచీ బంగారం ఎత్తుకు రావాలి... దాన్ని హైదరాబాద్‌లో అమ్ముకొని లక్షలు సంపాదించాలి... ఇదీ చోటా మోటా స్మగ్లర్ల ఆలోచనలు. ఇందుకోసం వాళ్లు ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తున్నారు. కొంత మంది పెళ్లి శుభలేఖల్లో బంగారం దాస్తే... ఇంకొందరు... డ్రిల్లింగ్ మిషన్‌లో దాచారు. మరికొందరు షూ అడుగు భాగంలో దాచారు, ఇంకొందరు సూట్‌కేస్ లోపలి పొరలో దాచారు. ఇలా ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా... ఎయిర్‌పోర్ట్‌లోని అధికారులు పట్టేసుకుంటున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకు దొరకకూడదన్న ఉద్దేశంతో... ఓ కొత్త ప్లాన్ వేసిన ఇద్దరు స్మగ్లర్లు... దుబాయ్ నుంచీ విమానంలో బయలుదేరి శంషాబాద్ ఎయిర్‌‌పోర్టులో దిగారు. చాలా తెలివిగా... తనిఖీ అధికారుల దగ్గరకు రాగానే... తమ సూట్‌కేసులు, బ్యాగులను వారికి ఇచ్చారు. నథింగ్, నథింగ్ అంటూ హడావుడి చేశారు. అధికారులకు ఆల్రెడీ సిగ్నల్స్ వచ్చేశాయి. బ్యాగులు, సూట్‌కేసులను చెక్ చేసి... ఎస్ నథింగ్... నథింగ్ అంటూనే... వాళ్లను పక్కన నిల్చోమన్నారు. వాళ్లిద్దరు ముఖాలు చూసుకొని... వై... వై సైడ్... అంటూ హడావుడి చేస్తుంటే... పదండ్రా అని పక్కకు తీసుకెళ్లి... షూ సాక్స్ తీయించారు. ఆ సాక్సులో బంగారం ముద్దలు దొరికాయి. అధికారుల ఫేసుల్లో నవ్వు, స్మగ్లర్ల ఫేసుల్లో శాడ్ ఫీలింగ్స్ కనిపించాయి.

Gold smuggling, shamshabad airport, customs officers, gold, Dubai, బంగారం స్మగ్లింగ్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, కస్టమ్స్ ఆఫీసర్స్, గోల్డ్, దుబాయ్
బంగారాన్ని పేస్ట్‌లా చేసి... షూ సాక్స్‌లో దాచి... ఫలించని స్మగ్లర్ల ఎత్తుగడ


ఫొటోల్లో బంగారం చూశారుగా ఎలా తళతళా మెరిసిపోతోందో. అది మొత్తం 826.68 గ్రాములుంది. దాని రేటు రూ.35.22 లక్షలు. కస్టమ్స్ యాక్ట్ కింద ఆ బంగారం మొత్తాన్నీ సీజ్ చేశారు. స్మగ్లర్ల ప్లాన్ బెడిసికొట్టింది. నెక్ట్స్ మళ్లీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తారో.
Published by: Krishna Kumar N
First published: February 28, 2020, 2:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading