• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MESSAGES CAME BUT MONEY NOT CREDITED IN ACCOUNT BHARAT PAY APP QR CODE FRAUD IN PEDDAPALLI HSN

ఫోన్లో భారత్ పే యాప్.. డబ్బులు జమ అయినట్టు మెసేజ్ లు కూడా.. తీరా బ్యాంకుకు వెళ్లి చూస్తే..

ఫోన్లో భారత్ పే యాప్.. డబ్బులు జమ అయినట్టు మెసేజ్ లు కూడా.. తీరా బ్యాంకుకు వెళ్లి చూస్తే..

(ప్రతీకాత్మకచిత్రం)

రెండు రోజులు కిందట ఒక మహిళా స్వరూప బ్యాంకుకి వెళ్లి చూసుకోగా అసలు తన ఖాతాలోకి డబ్బులు జమ కాలేదు అని బ్యాంకు అధికారులు చెప్పడంతో సదరు బాధిత మహిళా నివ్వెర పోయింది . అదే సమయంలో భారత్ పే ఏజెంట్ రావడంతో నిలదీసి అడగడంతో..

  • Share this:
    ఆర్ధిక నేరాలు రోజుకో తరహాలో బయటపడుతున్నాయి . కొన్ని నేరాలు జనాలని మభ్య పెట్టి చేస్తుంటే ఇంకొన్ని నేరాలు జనాలకి తెలియకుండానే జరుగుతున్నాయి . ప్రస్తుత టెక్నాలజీని అడ్డు పెట్టుకొని ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్నారు మోసగాళ్లు. ఇలా రోజుకి ఎన్నో సైబర్ నేరాలు ఒక్కోటి ఒక్కో రకంగా అధికారులు ఛేదిస్తూ బయట పెడ్తున్నారు. పెద్దపల్లి జిల్లా, ఎన్టీపిసి, జ్యోతి నగర్ లో కొత్త తరహా ఆర్ధిక నేరం వెలుగు చూసింది. ఇది తెలియని బాధితులు ఐదు నెలలు ఆర్థిక లావాదేవీలు నష్టపోయారు. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా, రామగుండం, ఎన్టీపీసీకి చెందిన కొందరు నిరక్ష్యరాస్యులు ఎన్టీపిసి మేడి పెల్లి సెంటర్ లో కూరగాయలు, పండ్లు. పూల, వ్యాపారం నిర్వహిస్తూ జీవనం వెళ్లదీస్తున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ లో భారత్ పే మర్చంట్ ఎక్స్ క్యూటివ్ వచ్చి క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకోవాలని చెప్పాడు. దాని గురించి వివరించాడు. దీంతో వ్యాపారులు అంగీకరించి తమ కూడా మొబైల్ ఫోన్స్ ఇవ్వగా భారత్ పే యాప్ ఇన్స్టాల్ చేసాడు.

    అది మొదలు వినియోగ దారులు క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు చెల్లింపులు జరుపుతున్నారు. ఇలా ఐదు నెలలు గడిచాయి వ్యాపారుల ఖాతాలోకి ప్రతి సారి డబ్బులు జమ అవుతున్నాయన్న మెసేజ్ మొబైల్ కు వచ్చేది. రెండు రోజులు కిందట ఒక మహిళా స్వరూప బ్యాంకుకి వెళ్లి చూసుకోగా అసలు తన ఖాతాలోకి డబ్బులు జమ కాలేదు అని బ్యాంకు అధికారులు చెప్పడంతో సదరు బాధిత మహిళా నివ్వెర పోయింది . అదే సమయంలో భారత్ పే ఏజెంట్ రావడంతో నిలదీసి అడగడంతో ’మీ మొబైల్ నెంబర్ కు ఉన్న క్యూఆర్ కోడ్ కి వేరే వారి ఖాతా నెంబర్ జోడించి ఉంది. ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది అని అందుకే నాలుగు నెలల ఆర్ధిక లావాదేవీలు వేరేవారి ఖాతాలోకి వెళ్లాయి‘ అని భారత్ పే ఎగ్జిక్యూటివ్ తడబడుతూ తెలిపాడు.

    ’మాకు చదువు రాదు. ఈ ఆన్ లైన్ డబ్బుల గురించి మాకు ఏమీ తెలియదు. లావాదేవీల ప్రక్రియ సులభంగా ఉంటుందని క్యూఆర్ కోడ్ జనరేట్ చేశాడు. మా మొబైల్స్ లోని భారత్ పే యాప్ క్యూఆర్ కోడ్ లకు వేరే వాళ్ల ఖాతాలు ఇచ్చాడు. మా లాంటి నిరక్ష్యరాస్యులను మోసం చేశాడు. ఇదెంత వరకు సమంజసం‘ అని ఆ వ్యాపారులు వాపోతున్నారు. వెంటనే ఇలాంటి సంస్థలపైన, మోసపూరిత ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పటికే క్యూఆర్ కోడ్లు వాడుతున్న పలువురు వ్యాపారులు భయాందోళనలకు గురవుతున్నారు.
    Published by:Hasaan Kandula
    First published: