జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ సైరస్ మిస్త్రీ ప్రమాదంపై దర్యాప్తు చేయనుంది. కంపెనీ ఏర్పాటు చేసిన బృందం ప్రమాదానికి గురైన కారు డేటాను సేకరించింది. పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ (Cyrus Mistry) ప్రయాణిస్తున్న బెంజ్ కారు డివైడర్‌ను ఢీకొనడంతో ఆయన చనిపోయారు. అయితే ఈ ప్రమాదంపై మరింత లోతుగా దర్యాప్తు జరిగే క్రమంలో బెంజ్(Mercedes Benz) కంపెనీ కూడా రంగంలోకి దిగినట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి మంగళవారం వెల్లడించారు. మెర్సిడెస్ కారు డేటాను విశ్లేషిస్తున్నట్టు తెలిపారు. ఇది కాకుండా కారు టైర్ ప్రెజర్, బ్రేక్ ఫ్లూయిడ్ స్థాయిని కూడా తనిఖీ చేస్తామని, తద్వారా ప్రమాదానికి గల కారణాన్ని నిర్ధారించవచ్చని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజయ్ మోహితే తెలిపారు. మెర్సిడెస్ బెంజ్ కంపెనీ అధికారులు ప్రమాదానికి గురైన కారు నుండి పొందిన డేటాను సేకరించారని.. తదుపరి విచారణ కోసం ఈ డేటా విశ్లేషించబడుతుందని.. అనంతరం దానిని పోలీసులకు ఇస్తారని చెప్పారు.
తక్కువ బ్రేక్ వాల్యూమ్ కారణంగా బ్రేక్ లైన్‌లోని పగుళ్లలోకి గాలి వస్తుంది. ఇది బ్రేక్‌లను తేలికగా మారుస్తుందని మోహితే చెప్పారు. 'స్పాంజీ' బ్రేక్ పెడల్స్ ప్రమాదకరమని ఆయన అన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో తరం Mercedes Benz GLC లగ్జరీ SUVలో సైరస్ మిస్త్రీతో సహా 4 మంది ప్రయాణిస్తున్నారు. ఈ కారు చాలా సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. దీనికి 5 స్టార్ రేటింగ్ కూడా వచ్చింది.
కారు వెనుక ప్రయాణీకులకు ఎయిర్‌బ్యాగ్‌లతో సహా అనేక భద్రతా ఫీచర్లను కలిగి ఉంది.మిస్త్రీ, పండోలె ఆదివారం మధ్యాహ్నం గుజరాత్ నుండి ముంబైకి వెళుతుండగా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో సూర్య నదిపై వంతెనపై వారి కారు డివైడర్‌ను ఢీకొట్టింది.
Tata Motors: టాటా మోటార్స్ నుంచి ఫస్ట్ CNG ట్రక్కు లాంచ్.. పూర్తి వివరాలివే..
Online Shopping: అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్... ఈ 5 క్రెడిట్ కార్డ్స్‌తో అదిరిపోయే ఆఫర్స్
ఈ ప్రమాదంలో కారు వెనుక కూర్చున్న టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ, జహంగీర్ మృతి చెందారు. గైనకాలజిస్ట్ అనహిత పండోల్ (55) కారును నడుపుతుండగా, ఆమె భర్త డారియస్ పండోల్ (60) కూడా ముందు కూర్చున్నాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరూ ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mercedes-Benz