ఖమ్మంలో కానిస్టేబుల్ వేలుకొరికిన సైకో

కానిస్టేబుల్ మన్సూర్ అలీకి వివరాలు చెప్పే క్రమంలో అతడి చేయి అందుకుని చిటికెన వేలిని కొరికి, కట్ చేసి దానిని నేలపై పడేశాడు.

news18-telugu
Updated: October 23, 2019, 9:12 AM IST
ఖమ్మంలో కానిస్టేబుల్ వేలుకొరికిన సైకో
కానిస్టుబుల్ మన్సూర్అలీ
  • Share this:
ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ వ్యక్తి కానిస్టేబుల్‌పై దాడి చేసి చిటికెను వేలు కొరికేశాడు. ఈ ఘటన ఖమ్మంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ వ్యక్తి కానిస్టేబుల్‌తో మాట్లాడుతూ అతడి చేతి వేలిని కొరికేశాడు. ఖమ్మంలో స్థానిక నాయీబ్రాహ్మణ కాలనీకి చెందిన డుంగ్రోతు మస్తాన్, మరో ఇద్దరు కలిసి అర్ధరాత్రి వేళ ఖమ్మం ఒకటో పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో మస్తాన్ చెలరేగిపోయాడు. కానిస్టేబుల్ మన్సూర్ అలీకి వివరాలు చెప్పే క్రమంలో అతడి చేయి అందుకుని చిటికెన వేలిని కొరికి, కట్ చేసి దానిని నేలపై పడేశాడు. తొడభాగంలోనూ కొరికాడు.దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న ఏఎస్సై నాగేశ్వరరావు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆయనపైనా కూడా మస్తాన్ దాడిచేశాడు. స్టేషన్ అద్దాలను బద్దలుగొట్టాడు.


మస్తాన్ ఇలా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదంటున్నారు పోలీసులు. అంతకుముందు కూడా ఆయన ఇలాగే ప్రవర్తించేవాడన్నారు. పోలీస్ స్టేషన్లు, రోడ్లపై గొడవలకు దిగేవాడని అంటున్నారు. గత కొన్నేళ్లుగా అతడు ఇలానే ప్రవర్తిస్తున్నట్టు తెలిపారు. ఓసారి రైలు పట్టాలపై కూర్చుని కాళ్లుపెట్టడంతో అతడి రెండు కాళ్లు తెగిపోయినట్టు తెలిపారు. పలు పోలీస్ స్టేషన్లలో అతడిపై కేసులు నమోదయ్యాయని వివరించారు. మస్తాన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
First published: October 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading