తల్లిదండ్రులనే చంపబోయిన కసాయి కొడుకు.. మహబూబ్ నగర్ లో దారుణం

నవమాసాలు మోసిన తల్లిని.. ప్రపంచాన్ని చూపిన నాన్ననే చంపబోయాడో కొడుకు. తనను ఇంట్లో కట్టేసి ఉంచినందుకు గానూ ఆ కొడుకు.. ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

news18
Updated: October 29, 2020, 10:38 AM IST
తల్లిదండ్రులనే చంపబోయిన కసాయి కొడుకు.. మహబూబ్ నగర్ లో దారుణం
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 29, 2020, 10:38 AM IST
  • Share this:
కన్నవారనే కనికరం కూడా లేకుండా జన్మనిచ్చిన వారిపైనే దాడికి పాల్పడ్డాడో కొడుకు. తనను గొలుసులతో కట్టేసి ఉంచారనే కోపంతో వారిపై దాడికి దిగాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో నారాయణ పేట్ జిల్లా మక్తల్ మండల పరిధిలో మద్వార్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది. కొడుకు అతి కిరాతకంగా గొడ్డలితో నరకడంతో ఆ వృద్ధ తల్లిదండ్రులిద్దరూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.

పోలీసుల కథనం ప్రకారం.. మద్వార్ గ్రామానికి చెందిన రాములు (57), కమలమ్మ (54) దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వెంకటేష్ (22) వారిపై దాడికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో.. తండ్రి రాములు తల్లి కమలమ్మ పై గొడ్డలితో దాడి చేశాడు. తండ్రి రెండు కాళ్లపై తల్లి భుజం చెయ్యి పై నరికాడు. బాధితులు కేకలు వేయగానే ఇరుగుపొరుగు వాళ్లు మేల్కొని వచ్చేలోపు నిందితుడు ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు.

కాగా, నిందితుడికి మతిస్థిమితం కోల్పోవడంతో అతడిని కొద్దికాలంగా ఇంట్లోనే దాచి ఉంచుతున్నట్టు తెలిసింది. అతడిని బయట ఎక్కడ అ తిరగకుండా ఇంట్లోనే పెట్టడంతో.. వెంకటేశ్ వారిపై కోపంతో రగిలిపోయేవాడని సమాచారం. ఇది మనసులో పెట్టుకున్న వెంకటేశ్.. అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డారని స్థానికులు అంటున్నారు.

కాగా, రాములు, కమలమ్మల చిన్న కుమారుడు ఆ తల్లిదండ్రులను మక్తల్ ఆసుపత్రికి చేర్పించారు. రక్తం ఎక్కువగా పోవడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయిన వారిని హైదరాబాద్ తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో అతడు వారిని ముక్తల్ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించాడు. ఇదిలాఉండగా.. తల్లిదండ్రులను గొడ్డలితో నరికిన నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడి కోసం వెతుకుతున్నట్టు వాళ్లు వివరించారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ లో వరుసగా హత్యాయత్నాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. దసరా నాడు కోడి కూర వండలేదనే కారణంతో ఓ తాగుబోతు భర్త తన భార్యను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది.
Published by: Srinivas Munigala
First published: October 29, 2020, 10:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading