సిద్దిపేట జిల్లాలో తండ్రిని చంపిన కొడుకు

తండ్రి కుమారుల మధ్య జరిగిన చిన్న గొడవ కారణంగా ప్రసాద్ తన తండ్రిపై బండరాళ్లతో దాడి చేసి హతమార్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

news18-telugu
Updated: September 11, 2020, 4:53 PM IST
సిద్దిపేట జిల్లాలో తండ్రిని చంపిన కొడుకు
తండ్రిని చంపిన కొడుకు
  • Share this:
కన్న తండ్రిని తన కుమారుడే బండ రాళ్లతో కొట్టి చంపిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది . స్థానికులు పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం సిద్దిపేట పట్టణంలోని శివాజీ నగర్ మంత్రి హరీష్ రావు ఇంటి ఎదుట గల వినాయక ఆర్థోపెడిక్ ఆసుపత్రి వెనుక గల బిల్డింగ్ ప్రక్కన కావేటి ఎల్లయ్య అనే వ్యక్తిని తన కుమారుడు ప్రసాద్ బండ రాళ్లతో కొట్టి హత్య చేశాడు. ఎల్లయ్య రెండో భార్య కుమారుడు ప్రసాద్. అతడి మనసిక పరిస్థితి బాగాలేదని, తండ్రి కుమారుల మధ్య జరిగిన చిన్న గొడవ కారణంగా ప్రసాద్ తన తండ్రిపై బండరాళ్లతో దాడి చేసి హతమార్చినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి ఏసీపీ రామేశ్వర్ చేరుకొని హత్య జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మృతుని శరీరం ఛిద్రంగా మారింది. ప్రసాద్ లొంగిపోయి తానే హత్యచేసినట్లు ఏసీపీ రామేశ్వర్ ఎదుట లొంగిపోయాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు ప్రసాద్ ఉన్నాడు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 11, 2020, 4:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading