• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • MEN ENTERED FIROZSHAH KOTLA STADIUM USING FAKE PASSES SENDING IPL MATCH INFORMATION AND ARRESTED JNK

IPL Betting : బెట్టింగ్ మాఫియాతో జట్టు కట్టిన డీడీసీఏ ఉద్యోగి.. నకిలీ పాసులతో గ్రౌండ్‌లోకి ప్రవేశించడానికి సహకారం..

డీడీసీఏ ఉద్యోగి సహా ఇద్దరు అరెస్టు.. బెట్టింగ్ మాఫియాకు సహకరించినట్లు ఆరోపణలు

ఐపీఎల్ 2021లో నకిలీ అక్రిడిటేషన్ కార్డులను తయారు చేసి బెట్టింగ్ మాఫియాకు సహకరించినట్లు ఆరోపణలు రావడంతో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

  • Share this:
    ఐపీఎల్ 2021లో (IPL 2021) భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో మే 2న రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నది. వీఐపీ గ్యాలరీలకు సమీపంలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు పదే పదే ఫోన్లలో మ్యాచ్ సమాచారాన్ని (Match Information) బయటకు చేరవేస్తూ సెక్యూరిటీకి కనిపించారు. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వారిని అదుపులోనికి తీసుకొని ప్రశ్నించారు. వారిద్దరూ నకిలీ పాసులతో (Fake Passes) లోపలికి ప్రవేశించినట్లు గుర్తించారు. వారిద్దరినీ ఢిల్లీ పోలీసులకు అప్పగించడంతోఆ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. మనీష్ కన్సాల్, కృష్ణన్ గార్గ్ అనే ఇద్దరు నకిలీ అక్రిడిటేషన్ కార్డులతో స్టేడియంలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. వీరిద్దరికీ వీరేందర్ సింగ్ షా, బాలమ్ సింగ్ ఈ అక్రిడిటేషన్ కార్డులను తయారు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్స్ (డీడీసీఏ)(DDCA)కు గత 10 ఏళ్లగా అక్రిడిటేషన్ కార్డులు తయారు చేయడానికి ఒక ఔట్ సోర్సింగ్ కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. ఆ కంపెనీలో వీరేందర్ సింగ్ షా లైజన్ ఆఫీసర్ సహాయకుడిగా, బాలమ్ సింగ్ క్లర్క్‌గా పని చేస్తున్నాడు.

    బెట్టింగ్ మాఫియాకు చెందిన కొంత మంది వీరిద్దరినీ కలసి నకిలీ అక్రిడిటేషన్లు కావాలని కోరడంతో వీరు రెండు పాసులు తయారు చేసి ఇచ్చారు. అప్పటికే లిస్టులో ఉన్న ఒక పారిశుథ్య విభాగపు ఉద్యోగి, మరో హెల్త్ వర్కర్ పాసులకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్‌లను తప్పించి.. వాటి స్థానంలో మనీశ్ కన్సాల్, కృష్ణన్ గార్గ్ పేర్లు చేర్చారు. ఈ నుండే అప్లికేషన్ ఫామ్స్ మార్చడానికి డీసీసీఏలోపని చేస్తున్న ఒక చిరుగ్యోగి సహకారాన్ని తీసుకున్నారు. అంతే కాకుండా ఆధార్ కార్డు జిరాక్స్‌పై ఫోర్జరీ సంతకాలు కూడా చేసి.. మొత్తానికి రెండు అక్రిడిటేషన్ కార్డులు పొందారు. మే 2న మనీశ్, కృష్ణన్ లను అదుపులోనికి తీసుకున్నారు. విచారణలో పలువురు పేర్లు బయటకు రావడంతో అటెండర్‌తో పాటు వీరేందర్ సింగ్, బాలమ్ సింగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

    వీరిద్దరూ గత కొన్నేళ్లుగా బెట్టింగ్ మాఫియాతో సంబంధం కలిగి ఉన్నారని. మ్యాచ్‌ల సందర్భంగా స్టేడియంలలోకి ప్రవేశించి బయటకు సమాచారం అందజేస్తున్నట్లు పోలీసలు గుర్తించారు. స్టేడియంలోని మ్యాచ్‌లకు, టీవీ ప్రసారానికి మధ్య మూడు నిమిషాల తేడా ఉంటుంది. దీన్ని ఆసరాగా తీసుకొని బెట్టింగ్ మాఫియా ఎప్పటి నుంచో ఈ పద్దతి అవలంభిస్తున్నది. అయితే ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రేక్షకుల అనుమతి లేకపోవడంతో నకిలీ అక్రిడిటేషన్ కార్డుల స్కాంకు తెరతీసినట్లు పోలీసులు చెబుతున్నారు. వీరి వెనుక ఉన్న బెట్టింగ్ మాఫియా ఎవరనే విషయంపై కూడా ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు.
    Published by:John Naveen Kora
    First published: