విదేశీ మహిళపై అత్యాచారయత్నం... ఇద్దరు అరెస్టు

Kerala : ఓవైపు నిర్భయ కేసులో దోషులకు ఎంత త్వరగా ఉరి వేయిద్దామా అని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే... ఆ భయాలేవీ లేకుండా విర్రవీగుతున్నారు రేపిస్టులు. అలాంటి ఇద్దరు కేటుగాళ్ల ఆటకట్టించారు పోలీసులు.

news18-telugu
Updated: February 6, 2020, 10:38 AM IST
విదేశీ మహిళపై అత్యాచారయత్నం... ఇద్దరు అరెస్టు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Kochi : కేరళలోని కొచ్చిలో జరిగిందీ ఘటన. థాయిలాండ్‌కి చెందిన బాధితురాలు... తన కొడుకును కేరళలోని మలప్పురంలోని విద్యాసంస్థలో చేర్పించింది. ఆమెకు మొదటి నుంచీ భారతీయుల సంప్రదాయాలు, విద్యా విధానాలంటే ఇష్టం. అందుకే కొడుక్కి తల్లిని వదిలి ఉండటం అంతగా ఇష్టం లేకపోయినా... బలవంతంగా ఇండియాలో చదివిస్తోంది. అప్పుడప్పుడూ ఇండియా వచ్చి... కొడుకును చూసుకుంటుంది. ఇందుకు సంబంధించి కేరళలోని... మహమ్మద్ ఇన్సాఫ్... ఆ పిల్లాడి బాగోగులు చూసుకుంటున్నాడు. తాజాగా ఆమె మరోసారి తన కొడుకును చూసుకునేందుకు ఇండియా రావాలని అనుకుంది. ఇదే విషయాన్ని మహమ్మద్ ఇన్సాఫ్‌కి చెప్పింది. కేరళ రమ్మన్న అతను... అన్ని ఏర్పాట్లూ చేశానన్నాడు. ఐతే... తెరవెనక అతనో కుట్ర పన్నాడు. అన్సారీ అనే మరో వ్యక్తిని తన కుట్రలో భాగం చేసుకున్నాడు. వీళ్లిద్దరూ కలిసి ఆమెను గ్యాంగ్ రేప్ చెయ్యాలని డిసైడయ్యారు.

తన వెనక జరుగుతున్న కుట్ర సంగతి తెలియని బాధితురాలు... తన కొడుకును చూసేందుకు కేరళ వచ్చింది. అక్కడి ఓ హోటల్‌లో దిగింది. ఆ తర్వాత మహమ్మద్ ఇన్సాఫ్‌తో కలిసి... విద్యాసంస్థకు వెళ్లింది. కొడుకును చూసింది. ఆప్యాయంగా పలకరించింది. డబ్బులు అవీ ఇచ్చి... బాగా చదువుకోమని చెప్పింది. స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి... పిల్లాడు ఎలా చదువుతున్నాడో తెలుసుకుంది. ఆ తర్వాత ఇన్సాఫ్‌తో కలిసి... తిరిగి తన హోటల్‌కి వెళ్లింది. రిటర్న్ థాయిలాండ్ వెళ్లేందుకు రెడీ అవుతుంటే... అదే సమయంలో... ఆ హోటల్ రూంలోకి అన్సారీ వచ్చాడు. అప్పటికే ఆమెతో కలిసి హోటల్‌కి వెళ్లిన ఇన్సాఫ్... అన్సారీని హోటల్ రూంలోకి రానిచ్చాడు. అతనెవరు అని ప్రశ్నిస్తే... తన ఫ్రెండ్ అని చెప్పాడు. ఇద్దరూ కలిసి ఆమెను గ్యాంగ్ రేప్ చెయ్యాలని యత్నించారు. ఆ క్రమంలో గట్టిగా అరుస్తూ... చేతికందిన వస్తువుల్ని వాళ్లపై విసిరేస్తూ... మొత్తానికి ఎలాగొలా హోటల్ గదిలోంచీ తప్పించుకున్న బాధితురాలు... హోటల్ యాజమాన్యానికి విషయం చెప్పింది. నమ్మిన వ్యక్తే ఇదంతా చేశాడని ఇన్సాఫ్‌పై మండిపడింది.

హోటల్ యాజమాన్యం ద్వారా... ఎర్నాకుళం సెంట్రల్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది బాధితురాలు. అప్రమత్తమైన పోలీసులు... ఇన్సాఫ్ మొబైల్ నంబర్ ట్రేస్ చేసి... అతన్నీ, అతనితో చేతులు కలిపిన అన్సారీనీ అరెస్టు చేశారు.
Published by: Krishna Kumar N
First published: February 6, 2020, 10:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading