ప్రభుత్వాలు మహిళలు, అమ్మాయిలపై వేధింపులు, హింసలు అరికట్టడానికి అనేక చట్టాలు తీసుకొచ్చాయి. అయినప్పటికి మహిళలపై వేధింపులు మాత్రం ఆగడం లేదు. దిశ, నిర్భయ వంటి కఠిన చట్టాలు సరైన విధంగా అమలు కావట్లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజు మహిళలు, అమ్మాయిలు వేధింపులకు గురౌతున్న ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. ప్రస్తుతం మరో ఘటన వెలుగులోనికి వచ్చింది.
పూర్తి వివరాలు.. మేఘాలయాలో దారుణం చోటు చేసుకుంది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు స్థానికంగా ఉన్న జోవాయి మార్కెట్ వద్ద మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించారు. మహిళను అక్కడే ఉన్న స్థంబానికి కట్టేశారు. ఆ తర్వాత దూశిస్తూ ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధిచిన వీడియో వైరల్ గా మారడంతో ఘటన వెలుగులోనికి వచ్చింది. మహిళ.. స్థానికంగా మార్కెట్ దొంగతనానికి పాల్పడిందని కొందరు ఆరోపించారు. అయితే, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళలను పునరావాస కేంద్రానికి తరలించారు. మహిళపై దాడిచేసిన వారిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై స్థానిక మహిళ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
బెంగళూరులో (Bengaluru) గత నెలలో దారుణం జరిగింది.
ప్రస్తుతం ఆ ఘటన మరోసారి వార్తలలో నిలిచింది. నగేష్ అనే వ్యక్తి తన భార్యతో తరచుగా గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యగొడవలు (disputes) తారా స్థాయికి చేరాయి. దీంతో నగేష్ కోపం పట్టలేక యాసిడ్ (Acide attack) తీసుకొచ్చాడు. తన భార్యపై యాసీడ్ తో (Acide attack on wife) దాడిచేశాడు. మహిళకు కొద్దిపాటు గాయాలు మాత్రమే అయ్యాయి. వెంటనే మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ వెళ్లితన భర్తపై ఫిర్యాదు చేసింది.
అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తునే ఉన్నారు. ఈ క్రమంలో నిందితుడు తమిళనాడులోని (Tamil nadu) ఒక ఆశ్రమంలో ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. వెంటనే వారు..ప్రత్యేక పోలీసులతో కలిసి తిరువణ్ణామలై జిల్లాలో వేలూరు సమీపానికి చేరుకున్నారు. అక్కడ ఒక ఆశ్రమం ఉంది. అక్కడ నగేష్ బాబా అవతారమెత్తాడు. దీంతో.. నగేష్ ను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Attack, Female harassment, Harassment on women, Meghalaya