హోమ్ /వార్తలు /క్రైమ్ /

Tragic Car Accident: నడిరోడ్డు మీద తగులబడిన కారు.. సజీవదహనం అయిన మాజీ సీఎం కొడుకు

Tragic Car Accident: నడిరోడ్డు మీద తగులబడిన కారు.. సజీవదహనం అయిన మాజీ సీఎం కొడుకు

మంటల్లో కారు దగ్ధమవుతున్న దృశ్యం

మంటల్లో కారు దగ్ధమవుతున్న దృశ్యం

మేఘాలయ(Meghalaya) రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. కారులో మంటలు రేగి ఆ మంటల్లో చిక్కుకోవడంతో మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు చనిపోయారు. ఈ విషాద ఘటన శనివారం జరిగినట్లు తెలుస్తోంది.

  షిల్లాంగ్: మేఘాలయ (Meghalaya) రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. కారులో మంటలు రేగి ఆ మంటల్లో చిక్కుకోవడంతో మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు చనిపోయారు. ఈ విషాద ఘటన శనివారం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఈకే మావ్‌లంగ్ (E K Mawlong) కుమారుడు ఫెర్డినాండ్ బీ లింగ్డో (Ferdinand B Lyngdoh) దుర్మరణం చెందారు. ఉమ్రన్ డైరీ సమీపంలో.. షిల్లాంగ్-గౌహతి జాతీయ రహదారిపై తన కారులో ఆయన వెళుతుండగా ఒక్కసారిగా కారులో మంటలు రేగాయి. కారు పక్కకు ఆపి దిగే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. సెకన్ల వ్యవధిలో మంటలు అలుముకున్నాయి. దీంతో.. మాజీ ముఖ్యమంత్రి కుమారుడు (Meghalaya Ex CM Son) మంటల్లో సజీవ దహనమయ్యారు.

  రి-భోయ్ జిల్లా ((Ri-Bhoi district) ఎస్పీ ఈ ఘటనపై స్పందిస్తూ.. కారులో ఉన్న ఏసీలో ఒక్కసారిగా మంటలు రేగాయని, బయటపడే అవకాశం లేకుండా విండోస్ పూర్తిగా మూసుకుపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. ఉమ్రోయ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న జార్జ్ లింగ్డోకు ఫెర్డినాండ్ సోదరుడు కావడం గమనార్హం. ఫెర్డినాండ్ ఇంఫాల్‌లోని సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనుబంధ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది స్పాట్‌కు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  ఇది కూడా చదవండి: Today Gold Rates: బంగారం ధరలు పైపైకి.. తులం బంగారంపై సోమవారం ఎంత పెరిగిందంటే...

  ఇక.. మేఘాలయ రాష్ట్రంలోనే ఇటీవల మరో విషాద ఘటన జరిగింది. సెప్టెంబర్ 29న తూర్పు గారో హిల్స్ జిల్లాలో 22 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి నదిలో పడిపోవడంతో బస్సులోని ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మిగిలిన వారిని స్థానికులు కాపాడారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలిసింది. ఈ ఘటనపై మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు తురా నుంచి రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Car accident, Car fire, Fire broke out, Meghalaya, National News

  ఉత్తమ కథలు