• HOME
 • »
 • NEWS
 • »
 • CRIME
 • »
 • MEGASTAR CHIRANJEEVI SAY MY HEARTILY THANKS TO HONORABLE CM YS JAGAN NGS

Andrha Pradesh: తిరుపతి ఉప ఎన్నిక ముందు పవన్ కు షాక్.. సీఎం జగన్‌కు చిరంజీవి కృతజ్ఞతలు

Andrha Pradesh: తిరుపతి ఉప ఎన్నిక ముందు పవన్ కు షాక్.. సీఎం జగన్‌కు చిరంజీవి కృతజ్ఞతలు

మెగాస్టార్ చిరంజీవి

మెగా అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. ఇటీవల తిరుపతి ఉప ఎన్నికలో పవన్ ఏపీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదే సమమంలో అన్న మెగాస్టార్ చిరంజీవి జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో జనసేన కేడర్ కు తలనొప్పి పెరిగింది.

 • Share this:
  తిరుపతి ఉప ఎన్నిక ముందు పవన్ కు అనుకోని షాక్ తగిలింది. ఓ వైపు తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. సొంత బాబాయ్ హత్య కేసు, కోడికత్తి కేసు డ్రామాలు ఏమయ్యాయి అంటూ నేరుగా ప్రశ్నించారు. ఇలా సీఎం జగన్ అంటేనే ఒంటికాలుపై లేచి నించుంటున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడికి అనుకోని షాక్ ఇచ్చారు. ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఓ వైపు ఉప ఎన్నిక ముందు జగన్ ను పవన్ తిడుతుంటే.. అందే సమయంలో అన్న చిరంజీవి పొగితే ఎలా అని అభిమానులు తలలు పట్టుకుంటున్నారు..

  తాజాగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అనుబంధ వ్యవస్థలకు రాయితీలు ప్రకటించారు సీఎం జగన్. దీంతో సీఎం జగన్ కు మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్ విలయతాండవం చేస్తున్న సమయంలో జగన్ చిత్ర పరిశ్రమకు లబ్ది చేకూర్చేలా ఇలాంటి చర్యలు ప్రకటించారని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి రాయితీలతో సినీ రంగం ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది అన్నారు. సీఎం జగన్ ఎంతో ఉదారంగా ప్రకటించిన ఈ రాయితీల వల్ల ఇండస్ట్రీపై ఆధారపడి ఉన్న వేలాది కుటుంబాలు త్వరగా కోలుకుంటాయి అంటూ చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.

  ఎందుకంటే ప్రస్తుతంతెలుగు ఇండస్ట్రీలో కరోనాతో దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఈ మధ్య కాస్త కోలుకుంటున్నట్లు అనిపిస్తున్నా.. మళ్లీ తాజా పరిస్థితి ఆందోళన పెంచుతోంది. రోజు రోజుకూ తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. సెకెండ్ వేవ్ ఇంకాస్త భయం పెంచుతోంది. దీంతో మళ్లీ ఎక్కడ లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందో.. లేదంటే ఎక్కడ మళ్లీ థియేటర్స్‌లో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ చేస్తారో అని కంగారు పడుతున్నారు నిర్మాతలు, సినిమా పెద్దలు. చాలా సినిమాలు.. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు ఇప్పటికే విడుదల తేదీలు కన్ఫర్మ్ చేసుకున్నాయి.

  ఇదీ చదవండి పవన్ అభిమానులకు గుడ్ న్యూస్. వారి కోరిక నెరవేరింది.

  చిత్ర పరిశ్రమ మొత్తం గందరగోళంలో ఉన్న సమయంలో టాలీవుడ్ కు శుభవార్త చెప్పారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చిత్ర పరిశ్రమకు కొన్ని రాయితీలు ప్రకటించారు. సినిమా ఇండస్ట్రీతో పాటు అనుబంధ సంస్థలపైనా వరాలు కురిపించారు. కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ఆయా రంగాలకు ఊరటనిచ్చేలా రాయితీలు ఇచ్చారు. 2020 ఎప్రిల్, మే, జూన్ నెలల్లో థియేటర్స్‌, మల్టీప్లెక్సులు చెల్లించాల్సిన స్థిర చార్జీల బకాయిలను 2021 జులై నుంచి డిసెంబర్ వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అలాగే బ్యాంక్ రుణానికి కూడా 50 శాతం వరకు వడ్డీ రేటు తగ్గిస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
  Published by:Nagesh Paina
  First published:

  అగ్ర కథనాలు