ఈ ఫోటోలో కన్పిస్తున్న మహిళ వికృత చేష్టలు గురించి తెలిస్తే మైండ్ బ్లాకే.. ఓ కామ పిశాచి..కోర్కెలు తీర్చుకోవడానికి..

Photo Credit : AP

ఈ ఫోటోలో కన్పిస్తున్న లేడీ..కాలిఫోర్నియాలో పెద్ద ఆఫీసర్. కాలిఫోర్నియా ఫ్రెస్నో కౌంటీ జైల్‌లో మగ ఖైదీల పర్యవేక్షణ, సవరణల అధికారిణిగా మూడేళ్లపాటు పని చేసింది. చూడటానికి సింపుల్ గా కన్పిస్తోన్న..ఈమె చేసే అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు.

  • Share this:
    ఈ ఫోటోలో కన్పిస్తున్న లేడీ..కాలిఫోర్నియాలో పెద్ద ఆఫీసర్. కాలిఫోర్నియా ఫ్రెస్నో కౌంటీ జైల్‌లో మగ ఖైదీల పర్యవేక్షణ, సవరణల అధికారిణిగా మూడేళ్లపాటు పని చేసింది. చూడటానికి సింపుల్ గా కన్పిస్తోన్న..ఈమె చేసే అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. వివరాల్లోకెళితే.. టీనా గోన్‌జలెజ్‌.. వయసు 27. కాలిఫోర్నియా ఫ్రెస్నో కౌంటీ జైల్‌లో మగ ఖైదీల పర్యవేక్షణ, సవరణల అధికారిణిగా మూడేళ్లపాటు పని చేసేది. ఆ మూడేళ్లలో ఖైదీలపై లైంగిక వేధింపులకు పాల్పడిందన్నది ఆమెపై ప్రధాన ఆరోపణ. నగ్నంగా వీడియో కాల్స్‌ మాట్లాడాలని, ఫోన్‌ కాల్స్‌లో శృంగార సంభాషణలు కొనసాగించాలని ఆమె ఖైదీలను బెదిరించేది. కొందరు ఖైదీలు తెగించి.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేరవేయడంతో ఈ లేడీ అకృత్యాలు వెలుగులోకి వచ్చాయ్. దీంతో ఆమెను విధుల నుంచి సస్పెండ్‌ చేసిన అధికారులు.. గత మే నెలలో ఆమెను అరెస్ట్‌ కూడా చేశారు. దర్యాప్తు సమయంలో గోన్‌జలెజ్‌ జైల్లో పాల్పడ్డ వికృత చేష్టలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. విచారణలో ఖైదీలపై తన కామ వాంఛల్ని తీర్చుకునేందుకు ఆమె ఘోరంగా ప్రవర్తించేదని తేలింది. ఒకరితో శృంగారంలో పాల్గొంటున్నప్పుడు.. మిగతావాళ్లను కన్నార్పకుండా చూడాలని కండిషన్‌ పెట్టేది. అలా చేయకపోతే వాళ్ళకు చుక్కలు చూపేది. ఇక వాళ్లకు పోర్న్‌ వీడియోలు చూపించి.. అందులో మాదిరి పాల్గొనాలని ఒత్తిడి చేసేది. అంతేకాదు శృంగారంలో పాల్గొనడానికి వీలుగా తన యూనిఫామ్‌కు ఆమె రంధ్రాలు చేసుకునేదని నివేదిక ఇచ్చారు అధికారులు. ఆ అకృత్యాల రిపోర్ట్‌ను చూసి జడ్జి సైతం బిత్తరపోయాడు.

    గోన్‌జలెజ్‌ మీద వృత్తిపరమైన ఫిర్యాదులు కూడా ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఖైదీలకు రేజర్లు, సెల్‌ఫోన్లతో పాటు మద్యం, డ్రగ్స్‌ సప్లై చేసేదని, "సెక్స్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ " లుగా వాటికి పేరు పెట్టిందని ఓ మాజీ ఖైదీ జడ్జి ముందు వాపోయాడు. ఇక ఆమెపై నమోదైన ఆరోపణలన్నీ నిజమేనని జైలు మాజీ అధికారి, ఈ నివేదికను రూపొందించిన స్టీవ్‌ మెక్‌కోమాస్‌ కోర్టుకు వెల్లడించాడు. నిందితురాలి తరపున కౌన్సెలర్‌ మాట్లాడుతూ.. ఆ టైంలో గోన్‌జలెస్‌ వైవాహిక జీవితం అర్థాంతరంగా ముగిసింది. ఆ బాధలోనే ఆమె అలా ప్రవర్తించిందని తెలిపాడు. ఆమె మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని క్షమించండి అని వేడుకున్నాడు.
    అయితే ఇంతటి దారుణాలకు పాల్పడ్డ ఆమెను జడ్జి ఒక "కామ పిశాచి" గా వర్ణించడం విశేషం. " నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావ్‌. మూర్ఖంగా వ్యవహరించావు. మిగతా జీవితం అయినా మంచిగా బతుకు" అని తీర్పు వెలువరించే ముందు జడ్జి వ్యాఖ్యానించాడు. అయితే, ఆమెకు నేర చరిత్ర లేకపోవడంతో మూడేళ్ల ఎనిమిది నెలలు శిక్షతో సరిపెట్టాడు జడ్జి. ఇప్పటికే జైలులో గడిపినందున.. ఆ శిక్షను మైనస్‌ చేసి మరో రెండేళ్లు సాధారణ జైలు శిక్ష విధిస్తున్నట్లు జడ్జి వెల్లడించాడు. మొత్తానికి ఏ జైల్లో అయితే అధికారిణిగా పనిచేసిందో.. అక్కడే ఇప్పుడు ఖైదీగా శిక్ష అనుభవిస్తోంది. అయితే, ఈమెకు విధించిన శిక్ష పట్ల ఆ జైలులోని ఖైదీలు అసహనం వ్యక్తం చేశారు. మమ్మల్ని ఇంతలా టార్చర్ చేసిన..ఆమెకు ఇంత తక్కువ శిక్ష వేయడం తగదని వాపోయారు.
    Published by:Sridhar Reddy
    First published: