Home /News /crime /

MEERUT MAN SHOOTS DEAD SISTER FOR REFUSING TO MAKE ROTIS FOR HIS 20 PET DOGS MS GH

కుక్కలకు రొట్టెలు చేయడం లేదని.. సొంత చెల్లినే చంపిన అన్న.. యూపీలో దారుణం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కల ను చూసుకోవడానికి నిరాకరించిందనే చిన్న కారణంతో తన చెల్లిని కాల్చి చంపాడో అన్న..  ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ (Meerut )లో జరిగింది.

  • News18
  • Last Updated :
రోజురోజుకూ మానవ సంబంధాలు పతనానికి పడిపోతున్నాయి. రక్త సంబంధాలు  క్షీణిస్తున్నాయి. కొందరు క్షణికావేశంలో తమ కుటుంబ సభ్యులు అని కూడా చూడకుండా వారిని పొట్టన పెట్టుకుంటున్నారు. ఇటువంటి సంఘటనలు మనం రోజూ మీడియాలో చూస్తూనే ఉంటాం. అలాంటి విషాదకర ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కల ను చూసుకోవడానికి నిరాకరించిందనే చిన్న కారణంతో తన చెల్లిని కాల్చి చంపాడో అన్న.. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ (Meerut )లో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మీరట్ నగరంలోని భవన్పూర్(Bhawanpur )కు చెందిన 25 ఏళ్ల ఆశిష్, 23 ఏళ్ల పారుల్ అన్నాచెల్లెలు. ఆశిష్ కు 20 పెంపుడు కుక్కలు ఉన్నాయి. అయితే, ఆ కుక్కల సంరక్షణను చూసుకోవాల్సిందిగా ఆశిష్ తన చెల్లెలు పారుల్ని కోరేవాడు. అంతేకాక, ప్రతి రోజూ తనకు, తన పెంపుడు కుక్కలకు రొట్టెలు(rotis) చేసి పెట్టాలని ఆదేశించేవాడు. అయితే, ఒక రోజు పారుల్ పెంపుడు కుక్కల సంరక్షణ చూసుకునేందుకు, వాటి కోసం రొట్టెలు చేసేందుకు నిరాకరించింది. దీంతో ఆశిష్, పారల్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన ఆశిష్.. చెల్లెలు అని కూడా చూడకుండా పారుల్ ను అక్కడికక్కడే తుపాకీతో కాల్చి చంపాడు.

చేసిన తప్పును ఒప్పుకుంటూ స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు..

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆశిష్ను అదుపులోకి తీసుకున్నారు. కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎస్పీ దేహాత్ కేశవ్ కుమార్ మాట్లాడుతూ“నిందితుడైన ఆశిష్ తన పెంపుడు కుక్కల సంరక్షణ చూసుకోవాల్సిందిగా, వాటికి రోజూ రొట్టెలు చేసి పెట్టాల్సిందిగా తన సోదరిని అడిగేవాడు. అయితే, ఒక రోజు తన సోదరి వాటికి రొట్టెలు చేసి పెట్టడానికి నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన నిందితుడు ఆశిష్ తన సోదరిని తుపాకీతో కాల్చి చంపాడు." అని ఆయన అన్నాడు. అయితే, ఆశిష్ తన సోదరిని తల, గుండె భాగాల్లో తుపాకీతో కాల్చాడని, చేసిన తప్పును ఒప్పుకోడానికి తానే స్వయంగా పోలీసులను పిలిచాడని తన పొరుగు ఇంట్లో నివాసం ఉండే వారు మీడియాకు వెల్లడించారు.
Published by:Srinivas Munigala
First published:

Tags: Crime, Crime news, Dog, Murder, Up news, Uttarpradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు