తెలిసినోడే కదా అని బైక్ ఎక్కితే.. అమలాపురంలో మెడికో కిడ్నాప్‌ కలకలం..

అప్పటికే ఏదో తేడా కొడుతున్నట్టుగా యువతికి అర్థమైనప్పటికీ.. సంకోచిస్తూనే బైక్ ఎక్కింది. మార్గమధ్యలో అతని మాటలు,ప్రవర్తనతో ఏదో కీడు జరగబోతున్నట్టు శంకించింది. దీంతో ఐపోలవరం పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే బైక్ పైనుంచి దూకేసింది.

news18-telugu
Updated: August 23, 2019, 12:14 PM IST
తెలిసినోడే కదా అని బైక్ ఎక్కితే.. అమలాపురంలో మెడికో కిడ్నాప్‌ కలకలం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఓ మెడికల్ విద్యార్థిని కిడ్నాప్ కలకలం రేపింది. పరిచయం ఉన్న వ్యక్తే కావడంతో..అతనితో బైక్‌పై బయలుదేరిన ఓ యువతి.. అతని దురుద్దేశం అర్థమై మధ్యలోనే బైక్‌పై నుంచి దూకేసింది. బైక్ పోలీస్ స్టేషన్ సమీపంలో నుంచి వెళ్తున్న సమయంలో దూకడంతో.. ఓ కానిస్టేబుల్ ఆమె వద్దకు వెళ్లి సహాయం చేశాడు. అనంతరం సదరు వ్యక్తిపై ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. అమలాపురంలోని కిమ్స్ మెడికల్ కాలేజీలో ఓ యువతి పీజీ చేస్తోంది. ఇటీవలే ఆమెకు పెళ్లి కూడా నిశ్చయమైంది. ఇదే క్రమంలో గురువారం కిమ్స్ మెడికల్ కాలేజీ సమీపంలో ఆమెకు అవినాష్ అనే వ్యక్తి ఎదురయ్యాడు. గతంలో పరిచయం ఉన్న వ్యక్తే కావడంతో అతనితో మాట్లాడింది.ఆ సమయంలో అవినాష్‌తో పాటు అజయ్ అనే మరో వ్యక్తి కూడా ఉన్నాడు. కలిసి చాలా కాలమైంది కదా.. అలా కాఫీ తాగుదాం రమ్మని ఆమెను పిలిచాడు. దాంతో ఆమె కారులో ఎక్కి వారితో పాటు బయలుదేరింది. అయితే కొంత దూరం వెళ్లాక కారు ఆపిన అవినాష్.. అక్కడినుంచి బైక్‌పై ఐనవల్లికి వెళ్దామని చెప్పాడు.

అప్పటికే ఏదో తేడా కొడుతున్నట్టుగా యువతికి అర్థమైనప్పటికీ.. సంకోచిస్తూనే బైక్ ఎక్కింది. మార్గమధ్యలో అతని మాటలు,ప్రవర్తనతో ఏదో కీడు జరగబోతున్నట్టు శంకించింది. దీంతో ఐపోలవరం పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే బైక్ పైనుంచి దూకేసింది. అక్కడే ఓ కానిస్టేబుల్ కూడా ఉండటంతో.. అవినాష్ అక్కడినుంచి పారిపోయాడు. కానిస్టేబుల్ సహాయంతో ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Published by: Srinivas Mittapalli
First published: August 23, 2019, 12:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading