Home /News /crime /

MEDICAL STUDENT COMMITS SUICIDE IN VIJAYAWADA ANDHRA PRADESH PRN

Andhra Pradesh: మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యపై వీడని మిస్టరీ.. అతనితో ప్రేమ వ్యవహారమే కారణమా...?

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విజయవాడ (Vijayawada)లో మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారామా..? వేధింపులా..? లేక చదువుల ఒత్తిడా..? అనేదానిపై దర్యాప్తు కొనసాగుతోంది.

    ఆంధ్రప్రదేశ్ విజయవాడలో మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారామా..? వేధింపులా..? లేక చదువుల ఒత్తిడా..? అనేదానిపై దర్యాప్తు కొనసాగుతోంది. వివరాల్లోకి వెళ్తే విజయవాడ భవానీపురంకు చెందిన మంగు నాగబాబు, జయలక్ష్మి దంపతుల కుమార్తె దేవి ప్రియాంక. నాగబాబు కొండపల్లిలోని జీ.ఎం.కే ల్యాబ్స్ లో పనిచేస్తున్నారు. దేవీ ప్రియాంక గుంటూరులోని కాటూరి మెడికల్ కాలేజీలో ఎండీ సెకండ్ ఇయర్ చదువుతోంది. రోజు మాదిరిగానే కాలేజీకి వెళ్లి ఇంటికొచ్చింది. రాత్రి 7.30 గంటల సమయంలో బంధువుల ఇంటికి వెళ్లగా.., ప్రియాంక ఇంటివద్దే ఉంది. తల్లిదండ్రులు తిరిగి వచ్చేసరికి ఫ్యాన్ కు ఉరేసుకొని కనిపించింది. కూతురికి ప్రాణముందేమోనన్న ఆశతో వెంటనే 108 కు ఫోన్ చేశారు. కానీ అప్పటికే లాభం లేకపోయింది.

    పక్కనే సూసైడ్ నోట్..
    దేవి ప్రియాంక బెడ్ పక్కనే ల్యాప్ టాప్, డైరీని పోలీసులు పరిశీలించారు. డైరీలో సూసైడ్ నోట్ లభించింది. సూసైడ్ నోట్ లో సారీ డాడీ.. ఐ లవ్ యూ డాడీ.. నాకు నువ్వంటే చాలా ఇష్టం డాడీ.. అమ్మా నువ్వంటే చాలా ఇష్టం.. బాయ్ అమ్మా.. బాయ్ నాన్నా.. నవీన్ వల్లే నేను చనిపోతున్నా అని రాసింది. దీంతో వారు భవానీపురం పోలీసులకు సమాచారమివ్వగా.. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

    ప్రేమ వ్యవహారమే కారణమా..?

    దేవి ప్రియాంక చిన్నప్పటి నుంచి మెరిట్ స్టూడెంట్. అందుకే తల్లిదండ్రులు ఆమెకు ఎంతో స్వేచ్ఛను ఇచ్చారు. ఈ మధ్య ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. నాలుగైద సంబంధాలు తీసుకొచ్చినా ఆమె అంగీకరించలేదు. ఐతే ప్రేమించిన వ్యక్తి గురించి తల్లిదండ్రులను ఒప్పించలేక.. బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సూసైడ్ నోట్ లో ఉన్న నవీన్ వ్యక్తి ఎవరు..? ప్రియాంకతో అతడికి ఏం సంబంధం..? అనే అంశాలు మిస్టరీగా మారాయి. దేవి ప్రియాంక ల్యాప్ టాప్, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమె కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు.

    మరోవైపు దేవి ప్రియాంక చదువుకుంటున్న మెడికల్ కాలేజీ యాజమాన్యంతో పాటు స్నేహితులు, క్లాస్ మేట్స్ ను పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నవీన్ అనే వ్యక్తి గురించి స్నేహితులను ఆరా తీసినట్లు సమాచారం.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Crime, Love affair, Student suicide, Vijayawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు